IT News: దేశీయ టాప్ ఐటీ సేవల కంపెనీల్లో ఒకటిగా విప్రో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి గడచిన కొన్ని త్రైమాసికాలుగా కంపెనీకి ఏమైందో తెలీదు గానీ వరుసగా టాప్ మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులు కంపెనీని వీడుతున్నారు. ఇది కంపెనీలోని ఉద్యోగుల్లో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయటంతో పాటు కంపెనీపై కూడా ఒత్తిడిని పెంచుతోంది.
తాజాగా ఆగస్టు 12, 2024న చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ శుభా తటవర్తి హఠాత్తుగా తన రాజీనామాను సమర్పించారు. ఆమె రాజీనామా ఆగస్టు 16తో బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. కంపెనీ బయట అవకాశాలను అందిపుచ్చుకునేందుకు విప్రోలోని ప్రస్తుత చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పాత్రకు రాజీనామా చేసినట్లు శుభా తటవర్తి వెల్లడించారు. మార్చి 2021లో విప్రోలో చేరారు. పైగా శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా నుంచి పనిచేశారు. శుభా రాజీనామాతో గడచిన రెండు త్రైమాసికాలుగా కొనసాగుతున్న విప్రో వరుస రాజీనామాల పరంపర ఆగస్టులో సైతం రిపీట్ అయ్యింది.

దీనికి ముందు మే 17న చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ చౌదరి సంస్థ వెలుపల అవకాశాల అన్వేషన కోసం అంటూ టెక్ దిగ్గజాన్ని వీడారు. దీంతో కంపెనీ చౌదరి స్థానంలోసంజీవ్ జైన్‌ను నియమించింది. మే 10న విప్రో ఆసియా పసిఫిక్, ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా అధ్యక్షుడు అనిస్ చెంచహ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ థియరీ డెలాపోర్టే ఏప్రిల్ 6 న రాజీనామా చేసిన తర్వాత మూడు పెద్ద రాజీనామాలు వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చౌదరి, చెంచా, డెలాపోర్టే అందరూ ఫ్రాన్స్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న క్యాప్‌జెమినీలో పనిచేశారు. డెలాపోర్టే విప్రో సీఈవోగా ఉన్నప్పుడు చెంచా, చౌదరి ఇద్దరూ విప్రోలో చేరారు.
2023లో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ జతిన్ దలాల్ రూపంలో మరొక ఉన్నత స్థాయి నిష్క్రమణను చూసింది. అతను కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌లో చేరటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ విప్రో కోర్టును ఆశ్రయించింది. ఆ క్రమంలో విప్రో దాఖలు చేసిన పోటీ రహిత వ్యాజ్యాన్ని రెండు పార్టీలు జూలై 9న పరిష్కరించాయి. కాగ్నిజెంట్ సంబంధిత ఆర్బిట్రేషన్‌ను పరిష్కరించేందుకు దలాల్‌కు 5,05,087 డాలర్లను చెల్లించింది. మెుత్తంగా 2023లో కంపెనీ దాదాపు 10 మంది సీనియన్ నాయకత్వంలోని ఉద్యోగులను కోల్పోయింది. ఈ క్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా విప్రో రాబడులు, మార్కెట్ వాటాలో కొనసాగుతున్న క్షీణతపై విశ్లేషకులతో పాటు ఇన్వెస్టర్లు సైతం ఆందోళన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications