Infosys: శుభవార్త చెప్పిన టెక్ దిగ్గజన ఇన్ఫోసిస్.. కొత్తగా 4,000 ఉద్యోగాలు, హైదరాబాద్..

IT News: ఇటీవల అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న టెక్ దిగ్గజం యాక్సెంచర్ తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భవిష్యత్తుపై కూడా ఆశాజనక వైకరిని కంపెనీ వెల్లడించిన సంగతి తెలిసిందే. అలాగే కంపెనీ తన ఆర్థిక ఫలితాలు ఊహించినదానికంటే మెరుగైన ఆదాయాలను నమోదు చేయటం భారతీయ ఐటీ పరిశ్రమలోని కంపెనీలకు మంచి రోజులు ముందున్నాయనే సానుకూల సంకేతాలను అందించింది.

ఈ క్రమంలో దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ బుధవారం తన బెంగాల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించింది. దీనిని న్యూ టౌన్‌లో రూ.426 కోట్లు వెచ్చించి టెక్ దిగ్గజం నిర్మించింది. కొత్త క్యాంపస్ ను దాదాపు 50 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నిర్మించిన ఈ క్యాంపస్ 4000 మంచి ఐటీ నిపుణులకు ఉపాధి అవకాశాన్ని కల్పించనున్నట్లు వెల్లడైంది. ఈ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ కు నూతన సంవత్సర కానుకగా పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ వేసిన తాజా అడుగులు భవిష్యత్తులో మరిన్ని ఐటీ కంపెనీల రాకకు దారితీస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటికే బెంగాల్ లో టీసీఎస్, విప్రో, ఐబీఎమ్, యాక్సెంచర్ వంటి పెద్ద ఐటీ కంపెనీలతో పాటు దాదాపు 2200 కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలను రాష్ట్రంలో నిర్వహిస్తున్నాయని ఆమె వెల్లడించారు.

IT Major Infosys started its Development center in West Bengal Know details

27,000 కోట్ల పెట్టుబడితో 75,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉన్న 200 ఎకరాల్లో కొత్త సిలికాన్ వ్యాలీ న్యూ టౌన్‍కి రాబోతోందని ముఖ్యమంత్రి మమతా వెల్లడించారు. ఈ క్రమంలో ఇప్పటికే 28 సంస్థలు 11 డేటా సెంటర్లతో కలిసి పనిచేస్తున్నట్లు మమతా చెప్పారు. అలాగే కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ రాబోతోందని, అది ఐటీ కంపెనీలకు కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని ఆమె నొక్కి చెప్పారు. డేటా సెంటర్లు, బ్రాడ్‌బ్యాండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోసం మార్గదర్శకాలకు సంబంధించిన విధానాలను కూడా రాష్ట్రం రూపొందించిందని వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌లో ఉన్న టాలెంట్ పూల్ తాము కొత్తగా ఏర్పాటు చేసిన డెవలప్‌మెంట్ సెంటర్ కు దోహదపడుతుందని సీఎఫ్ఓ జయేష్ సంఘ్‌రాజ్కా పేర్కొన్నారు.

నారాణయమూర్తి వ్యాఖ్యలు..
కాలుష్యంతో పాటు వాతావరణ మార్పులపై సకాలంలో ఎదుర్కోవడంలో విఫలమైతే భవిష్యత్తులో హైదరాబాద్, పూణే, బెంగళూరు నగరాలు పెద్ద ఎత్తున వలసలు చూసే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ సహయవ్యవస్థాపకుడు నారాణయమూర్తి వెల్లడించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల వల్ల ఈ మార్పు కలనిపిస్తుందని అన్నారు. ట్రాఫిక్ మరియు కాలుష్యం వంటి సమస్యల కారణంగా బెంగళూరు, పూణే, హైదరాబాద్‌లో నివసించడం చాలా కష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్‌లోని కార్పొరేట్ రంగం రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్‌లకు సహకరించాలి, భారీ వలసలు లేకుండా చూసుకోవాల్సిన సవాలుగా పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో మూర్తి పేర్కొనటం ప్రస్తుతం సంచలనంగా మారింది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+