Infosys: ఇన్నాళ్లుగా ఇంటి నుంచి పనిచేయటానికి అనుమతించిన చాలా ఐటీ కంపెనీలు ఇక ఆఫీసులకు రావాల్సిందేనని ఉద్యోగులకు తేల్చి చెబుతున్నాయి. కొన్నాళ్ల క్రితం ఐటీ మేజర్ టీసీఎస్ తన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పై క్లారిటీ ఇచ్చింది. తప్పక ఆఫీసులకు రావాల్సిన సమయం వచ్చేసిందని తేల్చి చెప్పింది. తాజాగా మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సైతం ఇదే దారిలో ముందుకు సాగుతోంది.

సీఈవో నిర్ణయం ప్రకారం..
ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి పిలవడంలో కంపెనీ తన అనువైన విధానాన్ని కొనసాగిస్తుందని అక్టోబర్‌లో CEO సలీల్ పరేఖ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనికి అనుగుణంగా ప్రస్తుతం కంపెనీ తన ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి రావాల్సిన సమయం వచ్చిందని అంతర్గతంగా ఉద్యోగులకు సమాచారం పంపింది. ఇందుకు కమ్యూనికేషన్‌లో మూడు దశల వర్క్-ఫ్రమ్-ఆఫీస్ ప్లాన్‌ను ప్రకటించింది.

దశల వారీగా..
టెక్ కంపెనీ మొదటి దశలో ఉద్యోగుల సౌలభ్యం ప్రకారం వారానికి రెండుసార్లు కార్యాలయానికి వెళ్లడానికి అనుమతించబడతారు. రెండో దశలో ఉద్యోగులు తమకు నచ్చిన ఇన్ఫోసిస్ కార్యాలయానికి బదిలీని తీసుకోవచ్చు. ఇక మూడో దశలో కంపెనీ రెండు దశల నుంచి అభిప్రాయాన్ని సేకరించి తదనుగుణంగా హైబ్రిడ్-వర్క్ పాలసీని రూపొందిస్తుందని సమాచారం. ఇది నిజంగా ఉద్యోగులకు చాలా అనుకూలమైనదని కంపెనీ చెబుతోంది.

ఇన్ఫోసిస్ HR హెడ్..
ఉద్యోగులకు పని సౌలభ్యంతో పాటు కంపెనీ ప్రాజెక్టులు, వ్యాపార అవసరాలను క్రియేటివిగా, ఆచరణాత్మకంగా చేయటం ద్వారా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ప్లాన్స్ ఉంటాయని ఇన్ఫోసిస్ HR హెడ్ క్రిష్ శంకర్ తెలిపారు. ఈ క్రమంలో గత త్రైమాసికంలో కంపెనీ ఉద్యోగుల అట్రిషన్ రేటు 27.1 శాతంగా ఉంది.

పరేఖ్ మాట్లాడుతూ..
దేశంలోని ఇన్ఫోసిస్ కార్యాలయాల్లో దాదాపు 45,000 మంది ఆఫీసులకు వస్తున్నట్లు అక్టోబర్ మాసంలో సీఈవో పరేఖ్ వెల్లడించారు. క్రమంగా మరింత మంది ఉద్యోగులు రోజూ ఆఫీసులకు వచ్చేందుకు వీలుగా చర్యలు చేపడతామని అప్పట్లో ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా కంపెనీ ప్రస్తుతం ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు అనువైన ప్రణాళికను సిద్ధం చేసింది.

మూన్‌లైటింగ్..
ఐటీ రంగాన్ని కుదిపేస్తున్న మూన్‌లైటింగ్ విషయంలో సైడ్ గిగ్ లకు కంపెనీ అంగీకరించింది. అయితే.. IT మేజర్ అంతర్గత ప్లాట్‌ఫారమ్, యాక్సిలరేట్‌ను కలిగి ఉంది. ఇది ఉద్యోగులు అంతర్గత ప్రాజెక్ట్‌ల కోసం గిగ్ వర్క్‌ని చేపట్టడానికి అనుమతిస్తుంది. దీనికి దాదాపు క్వార్టర్లీ 4,000 అప్లికేషన్లు వస్తున్నాయని తెలుస్తోంది. టీసీఎస్ సైతం ఇలాంటి అవకాశాన్నే ఉద్యోగులకు కల్పించింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications