Infosys News: ప్రపంచ వ్యాప్తంగా టెక్ కంపెనీలు రివర్స్ గేర్ తీసుకున్నాయి. ఇందుకు భారత కంపెనీలు సైతం ఏమాత్రం తీసిపోకుండా తొలగింపులను చేపడుతున్నాయి. దీంతో టెక్కీల కెరీర్ క్రమంగా ఆందోళనలో పడుతోంది.
ఇటీవల చాలా ఐటీ కంపెనీలు మాంద్యం సమయంలో తమ ఉద్యోగులను తొలగిస్తూ.. దీనికి రకరకాల కారణాలను చెబుతున్నాయి. ఇన్ఫోసిస్‌లో చేరిన తర్వాత FA పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయిన దాదాపు 5000 మంది ఫ్రెషర్లు తొలగించబడినట్లు ఈ ఏడాది వివిధ మూలాల నుండి నివేదించబడింది. వీరిలో ఎక్కువగా ఏడాది అనుభవం కలిగిన 2022, 2021 గ్రాడ్యుయేట్ ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.

గతంలో FA పరీక్షలో విఫలమయ్యే అభ్యర్థులకు టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ అనేక అవకాశాలను ఇచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం నేరుగా తొలగింపులకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. అలాగే ఇన్ఫోసిస్ బెంచ్‌లో ఉన్న టెక్కీల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తోందని సమాచారం. వారికి పనిచేసేందుకు ఎలాంటి ప్రాజెక్ట్ లేదా అవకాశం దొరకకపోతే వారిని తొలగిస్తామని బెదిరించింది. కంపెనీ ఏఐలో పెట్టుబడులు పెంచటం ద్వారా ఉద్యోగులను భర్తీ చేయాలని చూస్తోంది.

ఇన్ఫోసిస్ ప్రతి బ్యాచ్ నుంచి 350 మంది ఫ్రెషర్లను సైలెంట్‌గా తొలగిస్తోందని సాయి రవితేజ అనే వ్యక్తి ఒక పోస్ట్ చేశారు. అభ్యర్థులు మెుదటి రోజు నుంచే పనిని నేర్చుకోవటంలో ఎక్కువ శ్రద్ధ చూపాలని అతను పేర్కొన్నాడు. అయితే మెుత్తంగా తొలగింపుల సంఖ్య 10 వేల మార్కును చేరుకుందని తెలుస్తోంది. మాంద్యం నేపథ్యంలో ఖర్చుల భారాన్ని తగ్గించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తున్న కంపెనీ ఇప్పటికే తొలగింపులతో పాటు వేరియబుల్ వేతనాలను 10 శాతం మేర తగ్గించింది. ఈ పరిస్థితులు ఆర్థిక అస్థిరతల్లో ఐటీ కంపెనీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు అద్ధం పడుతోంది.


Click it and Unblock the Notifications