Infosys News: కళ్లు తిరిగే డీల్ కొట్టేసిన ఇన్ఫోసిస్.. టెక్కీల్లో చిగురిస్తున్న ఆశలు..
Infosys News: గత నెలరోజులుగా దేశీయ టెక్ కంపెనీలు వ్యాపార విస్తరణలో గేర్ మార్చి స్పీడ్ పెంచేశాయి. అమెరికా మార్కెట్లను మాత్రమే నమ్ముకోకుండా ఇతర మార్కెట్లకు విస్తరిస్తూ.. క్రేజీ డీల్స్ పడుతున్నాయి. ఈ ధోరణి కంపెనీల్లోని టెక్కీల్లో కొత్త ధైర్యాన్ని నింపుతున్నాయి.
వివరాల్లోకి వెళితే దేశంలోని టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ తాజాగా 1.6 బిలియన్ డాలర్ల విలువైన డీల్ చేసుకుంది. కఠిన వ్యాపార వాతావరణంలో డిజిటల్ కమ్యూనికేషన్స్ సంస్థ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ కనెక్టివిటీ ప్లాట్‌ఫారమ్‌లను నిర్మించడానికి, స్కేల్ చేయడానికి లిబర్టీ గ్లోబల్ నుంచి 1.5 బిలియన్ యూరోల($1.6 బిలియన్) డీల్ దక్కించుకుంది. ఇది ఇన్ఫోసిస్ ఈ ఏడాది చేసుకున్న మూడవ మెగా వ్యాపార ఒప్పందం.

ఆదాయాలు, మార్జిన్లు తగ్గి వ్యాపారంపై తీవ్రమైన ఒత్తిడి నెలకొన్న సమయంలో ఇన్ఫోసిస్ పెద్ద డీల్ చేసుకోవటం కొంత ఊరటను కలిగిస్తోంది. ఇది దేశీయ ఐటీ పరిశ్రమకు మంచి రోజులు రాబోతున్నాయనే సంకేతాలను పంపుతోంది. ఇన్ఫోసిస్ కోబాల్ట్‌ను ఉపయోగించి లిబర్టీ గ్లోబల్ కోసం తాము ఏర్పాటు చేసిన క్లౌడ్-ఫస్ట్ డిజిటల్ ఫౌండేషన్‌ను పూర్తి చేయడానికి ట్రాన్స్‌ఫార్మేటివ్ AI-ఫస్ట్ సామర్థ్యాలను ప్రారంభించడానికి ఇన్ఫోసిస్ టోపాజ్‌ను తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉందని కంపెనీ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు.
కంపెనీ చేసుకున్న ఒప్పందం ఐదేళ్ల ప్రారంభ కాలవ్యవధిని కలిగి ఉంది. తర్వాత దీనిని ఎనిమిదేళ్ల వరకు పొడిగించుకోవచ్చని వెల్లడైంది. ఇలా జరిగితే మెుత్తం డీల్ విలువ 2.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇన్ఫోసిస్ స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్‌లో వెల్లడించింది. లిబర్టీ గ్లోబల్ ఫిబ్రవరి 2020 నుంచి ఇన్ఫోసిస్ క్లయింట్‌గా ఉంది. అలాగే డీల్స్‌లో భాగంగా లిబర్టీ గ్లోబల్‌కు చెందిన 400 మంది ఉద్యోగులు కూడా ఇన్ఫోసిస్‌లో చేరనున్నారు. దీనికి ముందు ఈ ఏడాది ఇన్ఫోసిస్ బిపి నుంచి 1.5 బిలియన్ డాలర్ల డీల్, డాంక్సే బ్యాంక్ నుంచి 454 మిలియన్ డాలర్లు విలువైన డీల్‌ను గెలుచుకుంది.


Click it and Unblock the Notifications