BRICS: బ్రిక్స్ దేశాల సమావేశంలో డీ-డాలరైజేషన్ పై చర్చ.. ట్రంప్ షాక్ ఇస్తారా..!

బ్రిక్స్ దేశాలలో స్థానిక కరెన్సీ వాణిజ్యం, సులభమైన సరిహద్దు చెల్లింపుల కోసం భారత్ చేస్తున్న ప్రయత్నం కేవలం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇచ్చే సందేశం మాత్రమే కాదు. ఇది భారతదేశం వైఖరి గురించి వాషింగ్టన్, పశ్చిమ దేశాలకు కూడా ఒక సంకేతమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి న్యూఢిల్లీ ఆచరణాత్మక మార్గాల కోసం ప్రయత్నిస్తోంది. బ్రిక్స్ సభ్య దేశాల సొంత కరెన్సీలలో చెల్లింపులు జరగాలని కోరుకుంటోన్నాయి. అదే సమయంలో వాస్తవ విలువల్లో చైనా లేదా రష్యా కరెన్సీలను భారతదేశం అంగీకరించే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.

రూపాయి, యువాన్, రూబుల్, దిర్హమ్, బ్రెజిలియన్ రియల్‌తో సహా జాతీయ కరెన్సీలను ఉపయోగించి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించడంపై భారత్ దృష్టి సారించిందని నిపుణులు చెబుతున్నారు. భారత్ తన యూపీఐ, బ్రెజిల్ పిక్స్ వంటి వేగవంతమైన చెల్లింపుల వ్యవస్థలను అనుసంధానించడం ద్వారా, అలాగే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను అన్వేషించడం ద్వారా, సరిహద్దుల మధ్య చెల్లింపులు చౌకగా, వేగంగా మారాలని కూడా కోరుకుంటోందని పేర్కొంటున్నారు. బ్రిక్స్ దేశాల మధ్య ఏకీకృత చెల్లింపుల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి భారత్ సుముఖంగా లేదని వివరిస్తున్నారు.

BRICS

అయినప్పటికీ బ్రిక్స్ డీ-డాలరైజేషన్ ప్రయత్నాలకు ట్రంప్ గట్టిగా వ్యతిరేకత తెలిపిన నేపథ్యంలో ఈ చర్చ జరుగుతోంది. ట్రంప్ 2024 నవంబర్‌లో బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీని సృష్టించకూడదని లేదా అమెరికా డాలర్‌ను భర్తీ చేయడానికి ఉద్దేశించిన ఏ కరెన్సీకి మద్దతు ఇవ్వకూడదని కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఒకవేళ వారు అలా చేస్తే బ్రిక్స్ సభ్య దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తామని, అలాగే తాను "అమెరికా వ్యతిరేక" బ్రిక్స్ విధానాలుగా పిలిచిన వాటికి మద్దతు ఇచ్చే దేశాలపై అదనపు సుంకాలు విధిస్తామని ఆయన హెచ్చరించారు. బ్రిక్స్ దేశాల సమాశం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక భేటీ అయ్యే అవకాశం ఉంది.

మరో మూడు రోజుల్లో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సమావేశాల్లో ఈ భేటీ ఉంటుందని రష్యా అధికారికంగా ప్రకటించింది. ఈ ద్వైపాక్షిక చర్చల్లో సుకోయ్ యుద్ద విమానాలు, వాణిజ్యం, ఆర్థికపరమైన ప్రధాన ఎజెండాగా రెండు దేశాల నేతలు చర్చలు జరపనున్నాట్లు క్రెమ్లిన్ పేర్కొంది. సెప్టెంబర్ 11నుంచి న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాలు నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటిస్తారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+