Mphasis: దేశీయ ఐటీ కంపెనీలు అస్థిర ఆర్థిక, వ్యాపార పరిస్థితుల కారణంగా ఖర్చు మదింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో చాలా కంపెనీలు ఇప్పటికే ఉన్న ఉద్యోగులను తొలగించనప్పటికీ.. కొత్త వారిని మాత్రం రిక్రూట్ చేసుకోవటం ఆపేశాయి.

నలిగిపోతున్న ఫ్రెషర్స్..
టెక్ కంపెనీలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఎక్కువగా ప్రభావితం అవుతున్న వారిలో ఐటీ పరిశ్రమలోని యువ టెక్కీలు ఉన్నారు. చాలా కాలంగా ఆన్ బోర్డింగ్ కోసం వేచి ఉన్న వారికి కంపెనీలు రిక్తహస్తం చూపుతున్నాయి. ఇటీవల విప్రో ఏకంగా 452 మందిని స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఇంటికి పంపింది. ఇదే క్రమంలో కంపెనీ ఫ్రెషర్లను సగం జీతానికే పనిచేయాలని ఒప్పించేందుకు ప్రయత్నించింది. దీనిపై ఐటీ ఉద్యోగుల యూనియన్ ఫిర్యాదు చేయటం వివాదాస్పదంగా మారింది.

ఎంఫసిస్ సమస్య..
దేశీయ ఐటీ కంపెనీ ఎంఫసిస్‌లో చేరే తేదీ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లు కంపెనీకి, రిక్రూట్‌లకు మధ్య వచ్చే లెటర్ ఆఫ్ ఇంటెంట్ గడువు పూర్తి కావటంతో జాబ్ ఆఫర్‌ను కోల్పోయే అవకాశం ఉందని చాలా మంది ఆందోళన చెందుతున్నారు. కంపెనీ సెప్టెంబర్ 2021లో ఎంపికైన ఫ్రెషర్లకు అందించింది. అయితే గడచిన ఏడాది కాలంగా తమను ఆన్ బోర్డింగ్ కోసం కంపెనీ ఎప్పుడు పిలుస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కంపెనీ ఇచ్చిన జాబ్ ఆఫర్ మార్చిలో ముగుస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు.

సంచలన నిర్ణయం..
కంపెనీలో ఆన్‌బోర్డ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్ రిక్రూట్‌లకు చేసిన అన్ని ఉద్యోగ ఆఫర్‌లను గౌరవిస్తామని Mphasis స్పష్టం చేసింది. అభ్యర్థులచే ఆమోదించబడిన LoIని గౌరవించటానికి కంపెనీ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా నియామకాలు మరియు కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించేందుకు కట్టుబడి ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. అందువల్ల ఆన్ బోర్డింగ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కంపెనీ స్పష్టం చేసింది. ఈ వార్త యువ టెక్కీలకు పెద్ద ఊరటను అందిస్తోంది.


Click it and Unblock the Notifications