Shocking IT News: ఒక పక్క కంపెనీలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను భయపెడుతున్నాయి. ఇదే సమయంలో ఉద్యోగులు ఒక బాంబు లాంటి వార్త బయటపెట్టారు. తాజాగా టీమ్‌లీజ్ డిజిటల్ వెల్లడించిన నివేదికలో షాకింగ్ నిజాలు ప్రచురణ కావటం ఐటీ కంపెనీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక తలనొప్పి తగ్గుతోంది అని కంపెనీలు భావిస్తున్న సమయంలో మరో తలనొప్పి మెుదలైంది.

సంచలన రిపోర్ట్..
టీమ్‌లీజ్ డిజిటల్ నిర్వహించిన తాజా సర్వేలో వెలువడిన వివరాల ప్రకారం.. 2025 నాటికి 20 నుంచి 22 లక్షల మంది టెక్కీలు ప్రస్తుత ఉద్యోగాలను వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నట్లు తేలింది. అయితే వారు జీవితంలో మరోసారి ఈ రంగంలో ఉద్యోగం చేయమని తేల్చి చెప్పటం ఆందోళన కలిగిస్తుంది. దీని వల్ల ఉద్యోగుల రాజీనామాల పరంపర రానున్న కాలంలో ఐటీ-బీపీఎం కంపెనీలను ఉక్కిరిబిక్కిరి చేయనున్నట్లు తెలుస్తోంది.

టాలెంట్ కొరత..
'బ్రెయిన్ డ్రెయిన్: ఐటీ సెక్టార్‌లో గ్రేట్ టాలెంట్ ఎక్సోడస్‌ను ఎదుర్కోవడం' పేరుతో జరిగిన ఈ సర్వేలో రాజీనామాల రేటు 25.2 శాతం ఉంటుందని అంచనా వేయబడింది. ఇది 2023 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా 50-55 శాతానికి చేరుకుంటుందని తేలింది. అంటే ప్రతి ఇద్దరి ఉద్యోగుల్లో ఒకరు ఐటీ పరిశ్రమకు దూరం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే కంపెనీలను అనుభవజ్ఞులైన ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధించనుంది.

ఇతర రంగాలలోకి..
టెక్కీలు ప్రస్తుతం ఉన్న సంప్రదాయ ఐటీ కంపెనీలకు దూరంగా ఇతర రంగాల్లోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీని కారణంగా 2025 నాటికి 10 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నట్లు అంచనా. 57 శాతం మంది ఐటి నిపుణులు భవిష్యత్తులో ఐటి సేవల రంగంలోకి తిరిగి రావాలనే ఆలోచనలో లేరని తాజా నివేదికలో వెల్లడైంది.

కోటి ఉద్యోగాలు..
రానున్న కాలంలో ఐటీ రంగంలో ఉద్యోగుల సంఖ్య 50 లక్షల నుంచి కోటి మందికి చేరుకుంటుందని TeamLease Digital అంచనా వేసింది. అయితే ఈ క్రమంలో కంపెనీల యాజమాన్యాలు ఉద్యోగుల జీతాల పెంపు గురించి శ్రద్ధ చూపాలని సూచించింది. రానున్న రెండేళ్ల కాలంలో కంపెనీలు భలమైన నిర్ణయాలు తీసుకోకుంటే అత్యుత్తమ ప్రతిభ కలిగిన ఉద్యోగులను కోల్పోతాయని టీమ్‌లీజ్ డిజిటల్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శివ ప్రసాద్ నండూరి అన్నారు.

గరిష్ఠ స్థాయిలకు రాజీనామాల రేటు..
జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో టీసీఎస్ అట్రిషన్ రేటు 19.7 శాతం, ఇన్ఫోసిస్ అట్రిషన్ రేటు 28.4 శాతం, విప్రో అట్రిషన్ రేటు 23.3 శాతం, హెచ్‌సీఎల్ అట్రిషన్ రేటు 23.8 శాతంగా ఉండటం కంపెనీల మేనేజ్ మెంట్లకు ఆందోళన కలిగిస్తోంది.


Click it and Unblock the Notifications