ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేసిన వారు చెల్లించిన అదనపు వడ్డీ, లేట్ ఫీజును రీఫండ్ చేస్తామని ఆదాయపు పన్ను శాఖ తాజాగా వెల్లడించింది. సాధారణంగా ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు జూలై 31వ తేదీ వరకు గడువు ఉంటుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఈసారి గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించారు. దీనికి తోడు ఆదాయపు పన్ను శాఖ కొత్త వెబ్ సైట్‌లో కూడా సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆగస్ట్ 1వ తేదీ తర్వాత రిటర్న్స్ దాఖలు చేసిన వారు, చెల్లించాల్సిన పన్నుకు అదనపు వడ్డీ, లేట్ ఫీజు ఛార్జీ చెల్లించవలసి వచ్చింది. అయితే వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగిందని, దీనిని ఆగస్ట్ 1వ తేదీనే సరిదిద్దినట్లు ఐటీ శాఖ బుధవారం నాడు సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తెలిపింది.

ఫిర్యాదులు వెల్లువెత్తడంతో
జూలై 31, 2021 తర్వాత ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తుంటే వడ్డీ రేటు, లేట్ ఫీజును ఛార్జ్ చేస్తున్నట్లుగా ఉందని పలువురు ట్యాక్స్ పేయర్స్ ఫిర్యాదులు చేశారు. దీంతో ఆదాయపు పన్ను శాఖ స్పందించింది. అదనపు వడ్డీకి సంబంధించిన సెక్షన్ 234A, లేట్ ఫీజు సెక్షన్ 234F లను తొలగించినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ట్యాక్స్ పేయర్స్ ఐటీఆర్ తాజా సాఫ్టువేర్‌ను ఉపయోగించడం లేదా ఆన్‌లైన్ ద్వారా నేరుగా రిటర్న్స్ దాఖలు చేయాలని సూచించింది. ఇప్పటికే ఎవరైనా ఈ ఛార్జీలను చెల్లించి, రిటర్న్స్ దాఖలు చేస్తే సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (CPC)లో జరిగే రిటర్న్స్ పరిశీలనలో ఆ మొత్తాన్ని వెనక్కి ఇస్తామని వెల్లడించింది.

కొత్త వర్షన్ విడుదల చేస్తారు
నంగియా అండ్ కో ఎల్ఎల్‌పీ భాగస్వామి శైలేష్ కుమార్ మాట్లాడుతూ... ఐటీఆర్ లేదా ఇతర ఈ-పైలింగ్ యుటిలిటీస్‌లలో లోపాలు లేదా బగ్స్ ఉండటం సాధారణమేనని తెలిపారు. దోషాలు లేదా లోపాలు తమ దృష్టికి వస్తే ఆదాయపు పన్ను శాఖ ఈ-పైలింగ్ యుటిలిటీ కొత్త వర్షన్‌ను విడుదల చేస్తుంది. ఎర్రర్/బగ్‌ను తొలగిస్తుంది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్‌ను దాఖలు చేసే సమయంలో తాజా ఈ-ఫైలింగ్ యుటిలిటీని తనిఖీ చేయాలని సూచిస్తుంటారని శైలేష్ కుమార్ అన్నారు. ఏవైనా సమస్యలు లేదా లోపాలు కనిపిస్తే వెంటనే సమస్య పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

కొత్త ఐటీఆర్‌లో ఫంక్షన్స్
కొత్త ఆదాయపు పన్ను పోర్టల్ జూన్ 7వ తేదీ నుండి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుండి ఇందులో సమస్యలు కనిపిస్తున్నాయి. సమస్యను గుర్తించగానే, వాటిని పరిష్కరించేందుకు ఆర్థిక శాఖ, ఇన్ఫోసిస్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తోంది. ఈ కొత్త ఆదాయపు పన్న పోర్టల్‌లో యూజర్ ప్రొఫైల్, ఐటీఆర్ 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 4 ఫైలింగ్, ఈ-ప్రొసీడింగ్స్, పాత ఐటీఆర్స్ చూసుకోవడం వంటి ఫంక్షన్స్ ఉన్నాయి. ఇన్‌కం ట్యాక్స్ ఫైలింగ్ సిస్టంను నెక్స్ట్ జనరేషన్ డెవలప్‌మెంట్ కోసం ఇన్ఫోసిస్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. ఐటీ రిటర్న్స్ ప్రాసెసింగ్ టైంను తగ్గించే దిశగా పని చేసింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications