ఆదాయపు పన్ను శాఖ అధికారులు నేడు (ఫిబ్రవరి 17) నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ ముంబై నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆమె ఒక హిమాలయ యోగితో మాట్లాడిన సంభాషణలు ఇటీవల చర్చనీయాంశమయ్యాయి. ఎన్ఎస్ఈకి సంబంధించిన కీలక, రహస్య సమాచారాన్ని ఆమె యోగితో పంచుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్రా రామకృష్ణ నివాసంపై గురువారం ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. పన్ను ఎగవేత, ఆర్థిక అక్రమాల ఆరోపణలపై సోదాలు చేపట్టినట్లు తెలిపారు. యోగితో సమాచారాన్ని పంచుకున్నట్లు వార్తలు రావడంతో పాటు మార్కెట్ రెగ్యులేటర్ సెబి ఫిబ్రవరి 11న చిత్రా రామకృష్ణపై పెనాల్టీ విధించింది.

అందుకే సోదాలు
సెబి ప్రోబ్ నివేదిక ప్రకారం చిత్రా రామకృష్ణ డిసెంబర్ 2016లో ఎన్ఎస్ఈ నుండి బయటకు వెళ్లారు. ఆమె ఎన్ఎస్ఈకి చెందిన ఇంటర్నల్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్‌ను 2014-16 మధ్య గుర్తు తెలియని వ్యక్తులతో పంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ-మెయిల్ ద్వారా ఈ సమాచారాన్ని తెలియజేశారు. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, డివిడెండ్ సినారియో, ఫైనాన్షియల్ రిజల్ట్స్, హ్యూమన్ రిసోర్స్ పాలసీలు సంబంధిత అంశాలను పంచుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. మార్కెట్ రెగ్యులేటర్ ఆమె పైన రూ.3 కోట్ల పెనాల్టీ విధించింది.

ఎన్ఎస్ఈని నడిపించారా
అంతేకాదు, సీనియర్ అధికారులకు సంబంధించి అపాయింట్‌మెంట్‌లలను అవకతవకలు జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఎన్ఎస్ఈ చీఫ్ స్ట్రాటెజిక్ అడ్వైజర్‌గా ఆనంద్ సుబ్రమణియన్‌ను నియమించడం, తిరిగి గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎండీ సలహాదారుగా మార్చడం వంటి అంశాల్లో పాలనాపరమైన అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సెబి దర్యాఫ్తు చేపట్టింది. ఈ దర్యాఫ్తులో అనేక అంశాలు వెలుగు చూశాయి. హిమాలయాల్లో ఉండే ఓ ఆధ్యాత్మిక యోగి... చిత్రా రామకృష్ణపై ప్రభావం చూపించారని, ఆమె ద్వారా ఎన్ఎస్ఈని నడిపించారని సెబి గుర్తించింది.

యోగి మార్గనిర్దేశనం
ఆ యోగి ప్రభావం కారణంగానే క్యాపిటల్ మార్కెట్ అనుభవం లేని వ్యక్తిని ఎన్ఎస్ఈ ఆపరేటింగ్ ఆఫీసర్, సలహాదారుగా నియమించినట్లు సెబి తెలిపింది. ఎన్ఎస్ఈకి సంబంధించిన బిజినెస్ ప్లాన్స్, బోర్డు అజెండా, ఆర్థిక అంచనాలు వంటి కీలక విషయాలను యోగితో చిత్రా రామకృష్ణ పంచుకున్నట్లుగా సెబి పేర్కొంది. అయితే ఇరవై ఏళ్లుగా తన వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాల్లో ఆ యోగి మార్గనిర్దేశనం చేశారని చిత్రా రామకృష్ణ పేర్కొన్నారు.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications