టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి 5 దిగ్గజ కంపెనీలు ఈ ఏడాది లక్షకు పైగా కొత్త నియామకాలు చేపట్టనున్నాయి. చాలామంది క్లయింట్స్ డిజిటల్ మోడ్‌కు మారుతున్న నేపథ్యంలో క్యాంపస్ ద్వారా లక్షలాది మందిని తీసుకోనున్నాయి ఐటీ కంపెనీలు. భారత దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ క్యాంపస్ ద్వారా 40,000 మందిని నియమించుకోనుంది. ఇన్ఫోసిస్ 25వేల మందిని తీసుకోనుంది. ఎంతమందిని తీసుకుంటామనే విషయం విప్రో తెలియజేయనప్పటికీ, గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ మందిని తీసుకుంటామని తెలిపింది.

లక్షకు పైగా నియామకాలు
ఈ ఏడాది నైపుణ్యాలకు డిమాండ్ పెరగడంతో అయిదు ఐటి దిగ్గజాలు పెద్ద ఎత్తున టెక్కీలకు అవకాశమివ్వనున్నాయి. డిమాండ్ క్రమంగా పెరుగుతుండటంతో పాటు గ్రోత్ రేటు ఊపందుకోవడంతో నైపుణ్యాలకు గిరాకీ పెరిగిందని ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్ రావు ఇటీవల అన్నారు. టాప్ 5 టెక్ కంపెనీలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రాలు 1.10కి పైగా నియామకాలు చేపడతాయని స్టాఫింగ్ ఏజెన్సీ ఎక్స్ ఫెనో సహ వ్యవస్థాపకులు అన్నారు.

నిష్క్రమణ రేటు
తాజా నియామకాలతో పాటు ఉద్యోగుల నిష్క్రమణ రేటు అధికంగా ఉంటుందని చెబుతూ, ఈ ఏడాది భారీగా హైరింగ్ ఉంటుందని అంచనా వేశారు. కంపెనీలు ఐటీ వ్యయాలు పెంచడం, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో భారీ నియామకాలకు ఐటీ కంపెనీలు మొగ్గు చూపుతాయని చెబుతున్నారు. మైండ్ ట్రీ వంటి కంపెనీలు కూడా నియామకాలు చేపట్టనున్నాయి.

ఆట్రిషన్ రేటు
గత ఏడాది టాప్ ఫైన్ కంపెనీలు 2.10 లక్షల మందిని నియమించుకున్నాయి. ఇందులో ఆట్రిషన్ లింక్డ్ రిప్లేస్‌మెంట్ 1.20 లక్షలకు పైగా ఉంది. టీసీఎస్‌లో గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అతి తక్కువగా 7.2 శాతం ఆట్రిషన్ రేటు ఉంది. ఇన్ఫోసిస్, విప్రో కంపెనీల విషయానికి వస్తే ఆట్రిషన్ రేటు పెరిగింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications