Tech News: గత ఏడాది నుంచి దేశంలోని ఐటీ రంగం భారీ కుదుపుకు లోనవుతోంది. వ్యాపార మందగమనంతో కొత్త ప్రాజెక్టులు లేక భారతీయ టెక్ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చిన్న ఆర్డర్లతో చాలా కంపెనీలు కుదేలవుతున్నాయి.
మరోవైపు భారతదేశ ఐటీ పరిశ్రమ పెద్ద పరివర్తనకు గురవుతోంది. ఇది దేశంలోని ఐటీ పరిశ్రమపై ఆధారపడిన ఉద్యోగులపై రానున్న కాలంలో ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపించనుంది. ఇప్పటికే చాలా ఐటీ కంపెనీలు సైలెంట్ లేఆఫ్స్ కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మెుత్తం సాఫ్ట్‌వేర్ సేవల పరిశ్రమను మారుస్తుందనే భయాల ఫలితంగా పెద్ద మొత్తంలో వ్యాపారం, ఆదాయాన్ని కోల్పోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఈ క్రమంలో దేశంలోని దిగ్గజ ఐటీ కంపెనీలైన టాటా యాజమాన్యంలోని టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా ఒక అడుగు ముందుగా కళ్లు తెరిచాయి గత ఏడాది కాలంలో తమ వ్యాపారాలు, నాయకత్వ బృందాల ప్రధాన పునర్నిర్మాణంలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలోని 250 బిలియన్ డార్ల ఐటీ సేవల రంగంలో వ్యాపార తిరోగమనం మధ్య పునర్నిర్మాణం జరిగింది. ఇది ఐటీ సిబ్బంది నిశితంగా గమనించాల్సిన విషయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఐటీ కంపెనీలు ఇప్పుడు Gen AIపై దృష్టి సారించి ప్రత్యేక విభాగాలను సృష్టిస్తున్నాయి. ఈ విభాగంలోకి కొత్త ఉద్యోగులను చేర్చుకుంటున్నాయి. ఇది కొత్త రంగాల్లో వ్యాపారాన్ని వృద్ధి చేయడానికి, అంతర్గత డిజిటల్ నైపుణ్యంతో కొత్త వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఈ రంగంలో ఇప్పటికే ఉన్న కంపెనీల కొనుగోలుపై కూడా పని చేస్తోంది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్:
టీసీఎస్ సీఈవో కె కృతివాసన్.. కంపెనీ ఏఐ, క్లౌడ్ వ్యాపారాలను శివ గణేశన్ నేతృత్వంలోని ఒకే AI.Cloud యూనిట్‌లో విలీనం చేశారు. ఇదే క్రమంలో కంపెనీ ప్రపంచవ్యాప్తంగా నాయకత్వ స్థానాల్లో మార్పులు చేసింది. టీసీఎస్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ వంటి కార్పొరేట్ ఫంక్షన్లపై దృష్టి పెట్టడానికి "ఎంటర్‌ప్రైజ్ CPO" విభాగాన్ని సృష్టించింది. ఇది అశోక్ భాయ్ నేతృత్వంలో నడుస్తోంది.
ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో:
టెక్ మహీంద్రా కొత్త సీఈవో మోహిత్ జోషి ఆధ్వర్యంలో 12 పరిపాలనా విభాగాలు 6కి తగ్గించబడ్డాయి. అలాగే హెచ్‌సీఎల్ సేల్స్ టీమ్‌లను ఏకీకృతం చేయటంతో పాటు అనేక కీలక విభాగాల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించింది. మరో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్.. ఏఐ ఫస్ట్ కంపెనీగా పని చేయడం ప్రారంభించిందని సీఈవో సలీల్ పారిఖ్ వెల్లడించారు. ఏఐ ఆధారిత సేవలకు అన్ని శాఖలు ప్రాధాన్యతనిస్తూ పనిచేస్తున్నాయని తెలిపారు. దీనితో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) విభాగంలో కొత్త అవకాశాలను అన్వేషించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది.


Click it and Unblock the Notifications