IT News: ప్రస్తుత మాంద్యం సమయంలో టెక్కీలు రోజురోజుకూ ఊడిపోతున్నాయి. అయితే ఇది 2022తో ముగిసిపోలేదు. కానీ భారత్ తో సహా ప్రపంచవ్యాప్తంగా 2023లోనూ ఉద్యోగాలు పోతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి Layoffs.fyi సైట్లో షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి.

ఉద్యోగుల కోత..
ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 2023లో సగటున రోజుకు 1,600 మందికి పైగా టెక్ ఉద్యోగులు తొలగించబడుతున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాలు ముదురుతున్నందున తొలగింపుల్లో వేగం పెరిగింది. ఇది 2022లో దాదాపు 1000 కంపెనీలు 1,54,336 మంది ఉద్యోగులను తొలగించాయి.

టెక్ రంగంలో..
2022 ఆకరి త్రైమాసికం నుంచి ఐటీ రంగంలో తొలగింపులు ప్రారంభమయ్యాయి. ఇందులో ప్రధానంగా భారతీయ కంపెనీలు, స్టార్టప్‌లు సిబ్బందిని తొలగించడంలో అగ్రగామిగా ఉన్నాయి. తాజాగా షేర్‌చాట్ సంస్థ సైతం 20 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. దీనివల్ల 500 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యారని వెల్లడైంది. ట్విట్టర్, గూగుల్, స్నాప్, టైగర్ గ్లోబల్ కంపెనీల సహకారంతో ShareChat వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో దాదాపు 2,300 మంది ఉద్యోగులను కలిగి ఉంది.

తొలగింపులు
..
2022 డిసెంబర్ మాసంలో Jeet11 అనే ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌ను షేర్ చాట్ మూసివేసింది. ఓలా కూడా 200 మంది ఉద్యోగులను తొలగించింది. అలాగే వాయిస్ ఆటోమేషన్ స్టార్టప్ Skit.ai వంటి కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించాయి. కిరాణా డెలివరీ ప్రొవైడర్ Dunzo ఖర్చు తగ్గింపు చర్యల్లో భాగంగా 3 శాతం ఉద్యోగులను తొలగించింది.

బ్యాడ్ 2023..
ప్రపంచవ్యాప్తంగా టెక్ వర్కర్లకు 2023 చెడుగా ప్రారంభమైంది. దాదాపుగా 91 కంపెనీలు కొత్త ఏడాది మొదటి 15 రోజుల్లో 24,000 కంటే ఎక్కువ మంది టెక్ ఉద్యోగులను తొలగించాయి. ఇది రానున్న కాలంలో మరింతగా పెరగవచ్చని తెలుస్తోంది. ఈ గడ్డు పరిస్థితుల్లో లింక్డ్‌ఇన్ ద్వారా స్నేహితులు, సహఉద్యోగులను సహాయం కోరుతున్నారు. 2022లో ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి లింక్డ్‌ఇన్ యాప్ ను 58.4 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.


Click it and Unblock the Notifications