Liquor: దసరాకు దుమ్ములేపిన ఎక్సైజ్ ఆదాయం.. ఏరులై పారిన మద్యం..!

తెలుగు రాష్ట్రాల్లో మద్యం సేవించే వారు రోజు రోజుకు పెరుగుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో మద్య ప్రియులు ఎక్కువ అయ్యారు. దసరా సందర్బంగా రాష్ట్రంలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఒక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. ఉమ్మడి నిజమాబాద్ జిల్లాలో 2026, అక్టోబర్ 16, 17, 18 తేదీల్లో మద్యం అమ్మకాలు ఏకంగా 25 కోట్ల రూపాయలకు చేరాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 151 వైన్ షాపులు, 30 బార్లు ఉండగా.. అమ్మకాలు 25 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజుల్లోనే 16 వేల కేసుల మద్యం, 50 వేల కేసుల బీర్లు అమ్ముడయినట్లు తెలిపారు.

ఈ మందు అంతా మాక్లూర్ ఐఎంఎల్ డిపో నుంచి సరఫరా అయిందని అధికారులు పేర్కొన్నారు. 18, 19, 20 తేదీలను కూడా కలుపుకుంటే మద్యం అమ్మకాలు 35 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. 21వ తేదీ బుధవారం సైతం 6 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు, వ్యాపారులు. గత సంవత్సరం దసరా పండుగ పర్వదినాల్లో 19 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని.. ఈ ఏడాది రెట్టింపు ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. దసరాకు ముందు అక్టోబర్‌ 17న ఒక్క రోజే రూ.223.25 కోట్ల విలువైన మద్యం విక్రయాలు నమోదయ్యాయి.

Liquor

గత ఏడాది ఇదే తేదీన నమోదైన రూ.89.28 కోట్లతో పోలిస్తే.. ఇది రెండున్నర రెట్లు అధికం. ఈ నెల 1వ తేదీ నుంచి 17వ తేదీ నాటికి జరిగిన అమ్మకాల విలువ రూ.1751 కోట్లుగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది ఇదే వ్యవధిలో నమోదైన అమ్మకాలు రూ.1311 కోట్లు. అంటే, 33.5 శాతం పెరుగుదల నమోదైంది. రాష్ట్రంలో 2620 మద్యం దుకాణాలు, 1133 బార్లు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి దసరా సీజన్‌లో మద్యం అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది దసరా పండుగ అక్టోబరు 2వ తేదీన రాగా.. దానికి ముందు మూడు రోజుల్లోనే డిపోల నుంచి దుకాణాలకు రూ.697.23 కోట్ల విలువైన మద్యం సరఫరా జరిగింది. ఈ నెల 14న రూ.102.17 కోట్ల విలువైన విక్రయాలు జరగ్గా.. 16న రూ.126.32 కోట్లు, 17న రూ.223.25 కోట్లు, 19వ తేదీ సాయంత్రం నాటికి ఏకంగారూ.350 కోట్లకుపైగా విక్రయాలు నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో ప్రతి నెలా సాధారణంగా రూ.150 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా మద్యం విక్రయాలు జరిగే రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉన్నప్పటికీ.. మొత్తం రాష్ట్ర పన్నురాబడిలో మద్యం వాటా శాతంలో మాత్రం తెలంగాణే మొదటి స్థానంలో కొనసాగుతూన్న సంగతి తెలిసిందే. ఇక న్యూ ఇయర్ అప్పుడు రాష్ట్రంలో భారీగా మద్యం విక్రయాలు జరుగుతాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+