లాయల్టీ టాక్స్ (Loyalty Tax) అంటే ఏంటి? ప్రైవేట్ జాబ్స్ చేసే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజం!
మారే కాలంతో పాటు ప్రైవేట్ ఉద్యోగాల (jobs) మార్కెట్ కూడా వేగంగా మారిపోతోంది. చాలా మంది ఒకే కంపెనీలో ఏళ్ల తరబడి పనిచేస్తూ.. దాన్నే ఒక సేఫ్ జోన్ లాగా ఫీల్ అవుతుంటారు. అయితే, ఒకే కంపెనీలో ఐదేళ్లకు పైగా స్థిరపడిపోవడం అనేది మీకు తెలియకుండానే మీ ఆర్థిక భవిష్యత్తును నాశనం చేసే ఒక "నిశ్శబ్ద ఆర్థిక ఆత్మహత్య" (Financial Suicide) అని ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) నితిన్ కౌశిక్ హెచ్చరిస్తున్నారు.
ఇలా ఒకే చోట ఉండిపోవడాన్ని ఆయన "లాయల్టీ టాక్స్" (Loyalty Tax - విశ్వసనీయత పన్ను) గా అభివర్ణించారు. భారతదేశం లాంటి విపరీతమైన ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ఉన్న దేశంలో.. కంపెనీలపై చూపే అతి నమ్మకం వల్ల మీ జీతం పెరగకపోగా, మార్కెట్ రేట్లకు అనుగుణంగా మీరు వెనకబడిపోతారని సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) లో ఆయన రాసుకొచ్చారు.

ఇంక్రిమెంట్ 10%.. కానీ ఖర్చులు 14%
మన దేశంలోని టైర్-1 నగరాల్లో (హైదరాబాద్, బెంగళూరు వంటి చోట్ల) ఇళ్ల అద్దెలు, పిల్లల చదువులు, హాస్పిటల్ ఖర్చులు ఏటా 12% నుండి 14% వరకు పెరుగుతున్నాయని నితిన్ కౌశిక్ గుర్తుచేశారు.
"కంపెనీ ఇచ్చే 10 శాతం వార్షిక ఇంక్రిమెంట్ కోసం ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తుంటారు. కానీ నిజానికి మీ ఆదాయం ఏడాదికి కనీసం 15 శాతం పెరగకపోతే.. మీరు ఎదుగుతున్నట్లు కాదు, ప్రతి నెలా మరింత పేదవాళ్లు అవుతున్నట్లే లెక్క" అని ఆయన విశ్లేషించారు. మీ ఆదాయ వృద్ధి, దేశంలో పెరుగుతున్న ఖర్చుల కంటే ఎక్కువగా ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాలన్నారు.
మీ స్కిల్స్ 2023 లోనే ఆగిపోయాయా?
ఇప్పుడు నడుస్తున్నది ఏఐ (AI) యుగం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎన్నో పాత రకాల jobs ప్రమాదంలో పడుతున్నాయి.
- స్కిల్ స్టాకింగ్ (Skill Stacking) లేకపోవడం: "చాలా మంది ఉద్యోగులు తమ కంఫర్ట్ జోన్ నుండి బయటకు రారు. మీరు 2023లో చేసిన పనినే ఈ 2026లో కూడా సరిగ్గా అలాగే చేస్తుంటే.. అప్రైజల్ (జీతం పెంపు) మీటింగులలో కంపెనీని ఎక్కువ జీతం అడిగే హక్కును మీరు కోల్పోతారు" అని కౌశిక్ స్పష్టం చేశారు.
- పని గంటలు ముఖ్యం కాదు: ఆఫీసులో మీరు ఎన్ని గంటలు కూర్చున్నారనే దానికంటే.. కంపెనీకి వచ్చే ఎంత కష్టమైన సమస్యలను మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు అనే దానిపైనే మీ జీతం ఆధారపడి ఉంటుంది. ఆటోమేషన్, డేటా స్ట్రాటజీ లేదా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ లేకపోతే మార్కెట్‌లో మీ విలువ పడిపోతుంది.
ప్రతి 24 నెలలకోసారి మీ మార్కెట్ వాల్యూ చెక్ చేసుకోండి!
"ప్రస్తుత మార్కెట్లో ఉన్న పాత ఉద్యోగులను నిలుపుకోవడానికి (Retention) కంపెనీలు పెట్టే బడ్జెట్ కంటే.. కొత్త టాలెంట్‌ను హైర్ (Hiring) చేసుకోవడానికి కేటాయించే బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 'స్ట్రాటజిక్ జాబ్ స్విచ్చింగ్' (సరైన సమయంలో కంపెనీలు మారడం) అనేది మాత్రమే జీతం పెంచుకోవడానికి ఉన్న ఏకైక మార్గం" అని కౌశిక్ సలహా ఇచ్చారు.
మీరు గనుక ప్రతి 24 నెలలకోసారి (రెండేళ్లకు ఒకసారి) వేరే కంపెనీలలో ఇంటర్వ్యూలు అటెండ్ అవుతూ మీ మార్కెట్ వాల్యూను టెస్ట్ చేసుకోకపోతే.. మీ కెరీర్ మొత్తంలో లక్షలాది రూపాయల ఆదాయాన్ని చేజేతులా వదిలేసుకున్నట్లేనని ఆయన తేల్చి చెప్పారు. కంపెనీలపై చూపించే గుడ్డి నమ్మకం కంటే.. నిరంతరం కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ, కెరీర్‌లో యాక్టివ్‌గా ముందుకు సాగడమే సాఫ్ట్‌వేర్ , ప్రైవేట్ ఉద్యోగుల ఆర్థిక విజయానికి అసలైన సూత్రం!


Click it and Unblock the Notifications