మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ప్రత్యేకంగా మహిళా పెట్టుబడిదారుల కోసం ఒక చిన్న పొదుపు పథకంగా ఉంది. 2023 బడ్జెట్ లో ఈ పథకం తీసుకొచ్చారు. ఇది ఏప్రిల్ 2023-మార్చి 2025 వరకు రెండు సంవత్సరాల పాటు అందుబాటులో ఉండే వన్-టైమ్ స్కీమ్.
ఈ పథకం డిపాజిట్లు సంవత్సరానికి 7.5% వార్షిక వడ్డీ రేటును పొందుతారు. ఈ వడ్డీ రేటు ఈ త్రైమాసికానికి ఎలాంటి మార్పు చేయలేదు.
త్రైమాసిక ప్రాతిపదికన వడ్డీ జమ చేస్తారు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80C ప్రకారం ప్లాన్ కింద చేసిన పెట్టుబడి పన్ను ఆదా ప్రయోజనం పొందేందుకు అర్హత లేదు. ప్లాన్ కింద వచ్చే వడ్డీపై పన్ను విధిస్తారు. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ ఆదాయానికి పన్ను మినహాయింపు లేదు. మొత్తం వడ్డీ ఆదాయం, వ్యక్తిగత పన్ను స్లాబ్‌లను బట్టి టీడీఎస్ కట్ అవుతుంది.

డిపాజిట్ రెండు సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. ఖాతాదారు మెచ్యూరిటీ తర్వాత ఖాతాల కార్యాలయానికి ఫారం-2లో దరఖాస్తును సమర్పించడం ద్వారా అర్హతగల బ్యాలెన్స్‌ని పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ లేదా బ్యాంకుల్లో ఈ ఖాతా తెరవచ్చు. అయితే ఈ సంవత్సరం బడ్జెట్ లో ఈ పథకాన్ని పొడగిస్తారా లేదా అనేది చూడాలి. ప్రత్యేకమైన సందర్భాల్లో ముందస్తుగా ఖాతా మూసివేసేందుకు అవకాశం ఉంటుంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ కనిష్ఠంగా రూ.1000 గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. రెండేళ్ల కాలానికి మీరు రూ.2 లక్షలు పెట్టుబడి పెడితే రూ.32 వేల వడ్డీ వస్తుంది.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications