ఆన్‌లైన్‌లో రైల్వే టిక్కెట్ల బుకింగ్ మరింత ఈజీకానుంది. ఈ మేరకు IRCTC వెబ్‌సైట్‌ను అప్ గ్రేడ్ చేసింది. పునరుద్ధరించిన వెబ్ సైట్‌ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ గురువారం ప్రారంభించారు. భారతీయ రైల్వే తన ఈ-టికెటింగ్ వెబ్ సైట్ www.irctc.co.in, IRCTC రైల్ కనెక్ట్ మొబైల్ యాప్‌ను పునరుద్ధరించింది. వీటని రైల్వే టిక్కెట్లను ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకోవడం కోసం ఉపయోగిస్తారు. ఈ మార్పులు జనవరి 1, 2021 నుండి అమలులోకి వస్తాయి. IRCTC వెబ్‌సైట్‌ను ఆరుకోట్ల మందికి పైగా వినియోగిస్తున్నారు. రోజుకు సగటున ఎనిమిది లక్షలకు పైగా టికెట్లు బుకింగ్ అవుతున్నాయి. రిజర్వ్డ్ టికెట్లలో 83 శాతం ఆన్‌లైన్ ద్వారా జరుగుతున్నాయి.
అప్ గ్రేడ్ చేసిన వెబ్ సైట్ వివరాలు..
- యూజర్లు లాగిన్ అయ్యాక టికెట్లతో పాటు భోజనం, వసతి గదుల(రిటైరింగ్ రూమ్స్) వంటివి బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. టికెట్‌తో పాటు ట్రావెలర్స్‌కు వన్‌స్టాప్ సొల్యూషన్ లభిస్తుంది.
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా యూజర్ వెతికే స్టేషన్లు లేదా ప్రయాణీకుల వివరాలను బుకింగ్ సమయంలో వేగంగా అందిస్తోంది.
- యూజర్ ఈజీగా తన రీఫండ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇంతకుముందు ఈ ఫీచర్ అంత సులభంగా యాక్సెస్ కాలేదు.
- రెగ్యులర్ లేదా ఫేవరెట్ ప్రయాణాలను ఎంపిక చేసుకోవడం ద్వారా వివరాలను ఆటోమాటిక్‌గా ఎంటర్ చేయవచ్చు.

- ట్రెయిన్ సెర్చ్, సెలక్షన్‌కు సంబంధించిన వివరాలు అన్నీ ఒకే పేజీలో కనిపిస్తాయి. పేజీని స్క్రోల్ చేసి కావాల్సిన రైలు, కావాల్సిన క్లాస్‌ను బుక్ చేసుకోవచ్చు. ఇదివరకు ఒక్కో క్లిక్‌తో ఒక్కో ట్రెయిన్ వివరాలు తెలిసేవి.
- బ్యాకెండ్ క్యాచ్ సిస్టంను ప్రవేశ పెట్టడం ద్వారా సమాచారం ఆలస్యం కాకుండా చూస్తుంది.
- వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లకు సంబంధించి సీట్లు ఖరారయ్యే అవకాశాలను సూచిస్తుంది. గతంలో ఈ ఆప్షన్ ప్రత్యేకంగా వెతకవలసి వచ్చేది.
- ఇతర తేదీలలో సీట్ల లభ్యత వివరాలు కూడా కనిపిస్తాయి.
- టిక్కెట్ బుకింగ్ సమయంలో చెల్లింపుల పేజీలో ప్రయాణాల వివరాలు డిస్ ప్లే అవుతాయి. టైపింగ్ తప్పులుంటే సరిదిద్దుకోవచ్చు. క్యాప్చా వల్ సైబర్ సెక్యూరిటీకి వీలుంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications