Strait of Hormuz: హార్ముజ్ జలసంధి మూసివేత.. ఇప్పుడు ఈ అంశం ప్రపంచదేశాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ జలసంధిని మూసివేయాలని ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. గ్లోబల్ మార్కెట్లో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాలలో ఒకటైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు రంగంపై తీవ్రప్రభావం పడనుంది.ఇక భారతదేశంలో ద్రవ్యోల్బణం కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అంతేకాక చమురు ధరల కొరతతో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో పాటుగా అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ వాతావరణమే హోర్ముజ్ జలసంధి మూసివేతకు కారణం అవుతోంది. ఈ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలపగా తుది నిర్ణయం కోసం ఇరాన్ సుప్రీం జాతీయ భద్రతా మండలికి చేరింది. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఖ్చి విలేకరులతో మాట్లాడుతూ.. అమెరికా దాడులను ఎదుర్కోవడానికి తమ దగ్గర చాలానే మార్గాలు ఉన్నాయని స్పష్టం చేశారు. దీంతో ఇరాన్ తన చివరి అస్త్రంగా హోర్ముజ్ జలసంధి మూసివేస్తుందనే వార్తలు ఊపందుకున్నాయి.

ఈ పరిస్థితే కనుక వస్తే..తక్షణమే ముడి చమురు ధరలు 30 నుంచి 50 శాతం పెరిగే అవకాశం ఉందని, అదేవిధంగా గ్యాసోలిన్ ధరలు గ్యాలన్‌కు 5 డాలర్ల వరకు పెరగవచ్చని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పర్షియన్ గల్ఫ్‌ను గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రంతో కలిపే ఒక ఇరుకైన జలమార్గాన్ని హార్ముజ్ జలసంధి అంటారు. ఇరుకైన ప్రదేశంలో ఈ జలసంధి వెడల్పు సుమారు 21 మైళ్లు కాగా ఇరువైపులా రెండు మైళ్ల వెడల్పుతో రెండు నౌకా రవాణా మార్గాలున్నాయి.
కాగా ఈ జలాల్లో మైన్‌లను అమర్చడం, ట్యాంకర్లపై క్షిపణులతో దాడులు చేయడం ద్వారా ఈ మార్గాన్ని ఇరాన్ నౌకాదళం అడ్డగించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్రిక్తతలు చోటు చేసుకున్నప్పుడల్లా హార్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ ప్రపంచదేశాలకు బెదిరింపులు చేస్తూ వస్తూనే ఉంది.
అమెరికాపై హార్ముజ్ జలసంధి మూసివేత ప్రభావం: ఇప్పటికే అమెరికా దీనిపై రియాక్ట్ అయింది. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసివేయకుండా ఆపాలని అగ్రరాజ్యం అమెరికా డ్రాగన్ కంట్రీ చైనాకు విజ్ఞప్తి చేసింది. మీ దేశ ఇంధన అవసరాలు కూడా ఈ జలసంధిపై ఆధారపడి ఉన్నాయని కాబట్టి మూసివేయకుండా అడ్డుకోవాలని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చైనాకు సూచించారు. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ ప్రకారం.. 2024- 2025 మొదటి త్రైమాసికంలో ప్రపంచంలోని మొత్తం సముద్ర చమురు వ్యాపారంలో నాలుగో వంతు ఈ జలసంధి ద్వారానే జరిగింది. ప్రపంచంలోని మొత్తం చమురు, పెట్రోలియం ఉత్పత్తి వినియోగంలో ఐదవ వంతు ఈ మార్గం గుండానే సరఫరా అవుతుంది.
భారత్ మీద ప్రభావం ఎంత ? ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ వంటి దేశాల మీద ముడి చమురు దిగుమతులపై భారత్ ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ దేశాల నుండే భారత్ కు దాదాపు 40 శాతం దిగుమతులు ఉంటాయి. ఈ రవాణా అంతా హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఇక US ఇంధన శాఖ నివేదిక ప్రకారం.. 2024 సంవత్సరంలో హార్ముజ్ జలసంధి గుండా వెళ్ళిన ముడి చమురులో 84 శాతం ఆసియా దేశాలకు వెళ్లిందని చెబుతోంది.
భారతదేశం, చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు చమురులో దాదాపు 69 శాతం కొనుగోలు కొనుగోలు చేశాయి. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో దాదాపు 85 శాతం ఈ జలసంధి మార్గం ద్వారానే దిగుమతి చేసుకుంటోంది. ఇక అమెరికా, రష్యాల నుంచి చమురు నిల్వలు దిగుమతి పెంచేందుకు భారత్ అడుగులు వేసినా ఈ జలసంధి మూసివేత ప్రభావం గట్టిగానే పడనుంది.
హార్ముజ్ జలసంధి మార్గాన్ని మూసివేస్తే.. భారత్ లో అతిపెద్ద ప్రభావం ధరలపైనే ఉంటుంది తప్ప సరఫరాపై కాదు. చమురు ధరలు పెరుగుతాయి.. దీంతో దాని ప్రభావం పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆహార వస్తువుల రవాణాపై పడుతుంది. ద్రవ్యోల్బణం అధికమవడమే కాకుండా దేశ కరెంట్ ఖాతా లోటు పెరిగే అవకాశం ఉంది. రూపాయి విలువ కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతుంది. హార్ముజ్ సంక్షోభం తీవ్రం కాకముందే భారత ప్రభుత్వం ఈ విషయాలపై అలర్ట్ కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చమురు కంపెనీలు, ఆర్థిక మంత్రిత్వ శాఖ కలిసి పరిస్థితిని వెంటనే చక్కదిద్దే ప్రయత్నాలు చేపట్టాలి.
More From GoodReturns

హార్ముజ్ జలసంధి నిండా మందు పాతరలే.. ఏ క్షణమైనా పేలే అవకాశం.. ఇరాన్ స్కెచ్‌కి ట్రంప్ ఫ్యూజులు ఔట్..

LPG: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. భారీగా తగ్గిన చమురు ధరలు.. పుంజుకున్న మార్కెట్లు..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. పిచ్చెక్కిపోతున్న ట్రంప్.. ఈ రోజు రాత్రే అసలు కథ..

హార్ముజ్ జలసంధి వేదికగా ఇరాన్ భారీ స్కెచ్.. 500 బిలియన్ డాలర్ల రెవిన్యూ టార్గెట్.. ప్రపంచ దేశాలకు బిగ్ షాక్..

చైనాతో రహస్యంగా జతకట్టిన ఇరాన్.. అమెరికాకు బిగ్ షాక్..హార్ముజ్ జలసంధి వేదికగా డాలర్ ఆధిపత్యానికి చెక్..

ఈ రోజు రాత్రి ఇరాన్ శ్మశానంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన..

ఇరాన్ 10-సూత్రాల కాల్పుల విరమణ షరతులు ఇవే.. శాంతి చర్చల్లో ట్రంప్ వీటిని అంగీకరిస్తారా.. యుద్ధం ఆగినట్లేనా..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..



Click it and Unblock the Notifications