ఇరాన్‌పై ఇజ్రాయెల్-అమెరికా దాడి తరువాత పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు ఇప్పుడు నేరుగా భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను ప్రభావితం చేయడం మొదలయ్యాయి. ముఖ్యంగా భారత వాణిజ్యం, ఎగుమతులు, ఇంధన భద్రతపై ఈ యుద్ధ ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభం ప్రభావం ప్రధానంగా రెండు కీలక రంగాలలో కనిపిస్తోంది..ఒకటి ప్రపంచ ముడి చమురు ధరల పెరుగుదల, రెండవది ఇరాన్‌కు భారత ఎగుమతుల్లో అకస్మాత్తుగా వచ్చిన అంతరాయం.
భారతదేశం నుంచి ఇరాన్‌కు వెళ్లే ఎగుమతుల్లో బాస్మతి బియ్యం కీలక పాత్ర పోషిస్తుంది. ఇరాన్ భారత బాస్మతి బియ్యానికి అతిపెద్ద కొనుగోలుదారుల్లో ఒకటి కావడంతో, యుద్ధం మొదలైన వెంటనే భారత ఎగుమతిదారుల్లో ఆందోళన మొదలైంది. యుద్ధానికి రెండు నెలల ముందే ఇరానియన్ దిగుమతిదారులు భారీగా ఆర్డర్లు ఇచ్చారని ఫార్చ్యూన్ రైస్ లిమిటెడ్ డైరెక్టర్, ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయిన అజయ్ భలోటియా NDTVకి తెలిపారు. ఈ భారీ డిమాండ్ కారణంగా దేశీయ మార్కెట్లో బాస్మతి ధరలు కిలోకు సుమారు రూ.10 వరకు పెరిగాయి.

కానీ యుద్ధం మొదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం భారతదేశం నుంచి ఇరాన్‌కు పంపిన బాస్మతి బియ్యం నౌకలలోనే నిలిచిపోయింది. ప్రస్తుత భద్రతా పరిస్థితుల్లో ఆ సరుకులు ఇరాన్‌లో సురక్షితంగా డెలివరీ అవుతాయా లేదా అన్నదానిపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. దీని ఫలితంగా ఎగుమతులు మాత్రమే కాదు.. చెల్లింపులు కూడా ప్రమాదంలోపడుతున్నాయి.
ఆల్ ఇండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం.. భారతదేశ మొత్తం బాస్మతి బియ్యం ఎగుమతుల్లో దాదాపు 25 శాతం ఇరాన్‌కు, మరో 20 శాతం ఇరాక్‌కు వెళ్తాయి. మొత్తం మీద ఈ వ్యాపారం 2 మిలియన్ టన్నులకు పైగా బాస్మతి బియ్యం విలువ 2 బిలియన్ డాలర్లకు మించినది. గత ఏడాది భారతదేశం ఇరాన్‌కు 1.2 బిలియన్ డాలర్ల విలువైనబాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేసింది. ప్రస్తుతం ప్రాంతీయ ఘర్షణలు కొనసాగితే.. ఇరాక్‌తో పాటు మధ్య ఆసియా మార్కెట్లకు వెళ్లే ఎగుమతులపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.
ఇక భారతదేశ ముడి చమురు అవసరాల విషయానికి వస్తే.. దేశం ప్రస్తుతం అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా సహా 40కి పైగా దేశాల నుంచి చమురును దిగుమతి చేసుకుంటోంది. అయితే గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు భారత్‌కు చేరుకోవడానికి కేవలం 5 నుంచి 7 రోజులు మాత్రమే పడుతుంటే, అమెరికా లేదా లాటిన్ అమెరికా నుంచి అదే సరుకు రావడానికి 25 నుంచి 45 రోజులు పడుతుంది. అందుకే మధ్యప్రాచ్య చమురు భారత్‌కు తక్కువ ఖర్చుతో, వేగంగా లభిస్తుంది.
ఈ నేపథ్యంలో Strait of Hormuz కు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంది. ప్రపంచ ముడి చమురు సరఫరాలో 20 నుంచి 25 శాతం ఈ మార్గం గుండా వెళుతుంది. ఇంధన విశ్లేషణ సంస్థ Kpler ప్రకారం, భారతదేశం రోజుకు సుమారు 2.5 నుంచి 2.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును ఈ జలసంధి గుండా దిగుమతి చేస్తోంది. ఇది దేశ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 50 శాతం. ఈ చమురు ప్రధానంగా ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ నుంచి వస్తోంది.
ఇవన్నీ కాకుండా.. ఇరాన్‌కు భారతదేశం చేసే టీ ఎగుమతులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ దాదాపు రూ.7 బిలియన్ల విలువైన టీని ఇరాన్‌కు ఎగుమతి చేసింది. యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే.. వ్యవసాయ ఎగుమతులు, ఇంధన ధరలు, వాణిజ్య లోటు అన్నీ కలిసి భారత ఆర్థిక వ్యవస్థపై మరింత ఒత్తిడి పెంచే అవకాశం ఉంది.
More From GoodReturns

యుద్దంపై ఇరాన్ కీలక ప్రకటన.. భారీ సైనిక దాడులు చేస్తామంటున్న ట్రంప్.. అసలేం జరుగుతోంది..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

అమెరికాకు భారీ షాకిచ్చిన ఇరాన్.. 4 వేల మైళ్ల దూరం నుంచి డియాగో గార్సియా సైనిక స్థావరంపై దాడి..

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

ఇరాన్ యుద్దం.. భారీగా పెరిగిన డీజిల్ ధరలు.. ఇప్పుడు ఎంతకు చేరిందంటే..

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

ఇరాన్‌ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..

ట్రంప్ మరో భారీ స్కెచ్.. ఇరాన్ హార్ట్ అయిన ఖర్గ్ ద్వీపంపై కన్ను.. ఏ క్షణమైనా మిసైళ్లతో దాడి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు



Click it and Unblock the Notifications