IPL PLAYERS TAX: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 18వ సీజన్ తాజాగా ప్రారంభమైన సంగతి మీకు తెలిసే ఉంటుంది. అయితే ఈసారి ఊహించని విధంగా IPL ప్లేయర్స్ వేలం కోట్లలో జరిగింది. ఐపీల్ టీంలు ఒక్కో ప్లేయర్'ని కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసాయి. కానీ ఈ ప్లేయర్స్ అందరు పన్ను చెల్లించాల్సి ఉంటుందా.. అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల మనస్సులో తలెత్తుతుంది. దీనికి సమాధానం అవును అనే వినిపిస్తుంది.. అయితే వీరు ఎంత పన్ను చెల్లించాలి ? ఇతర దేశ ఆటగాళ్లతో పోల్చితే ఎంత కట్టాల్సి ఉంటుంది...

ఐపీఎల్‌లో ఆడే ఇండియన్ ప్లేయర్లకు ఇంకా బయటి దేశ ప్లేయర్లకు పన్ను నియమాలు భిన్నంగా ఉంటాయి. భారత చట్టం ప్రకారం భారతదేశంలో అలాగే విదేశాలలో భారతీయ ఆటగాళ్ల ఆదాయంపై ఆదాయపు పన్ను విధించబడుతుంది. అంతేకాదు IPLలో ఆడే ఇతర దేశ ఆటగాళ్లను 'నాన్-రెసిడెంట్'గా వర్గీకరిస్తారు, ఈ కారణంగా పన్ను విధానం భిన్నంగా ఉంటుంది. భారతీయ ఆటగాళ్ల ఆదాయంపై 10% TDS (tax deduction at source) వర్తిస్తుండగా, విదేశీ ఆటగాళ్లకు ఈ రేటు 20%. ప్లేయర్స్ కాంట్రాక్ట్ మొత్తాన్ని అందుకునే ముందు ఈ TDS కట్ చేస్తారు.
పేమెంట్ ప్రక్రియ: ఐపీఎల్‌లో ఆడే ఆటగాళ్ళు కాంట్రాక్ట్ మొత్తాన్ని పొందడానికి ముందుగా బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఇంకా సంబంధిత ఫ్రాంచైజీతో ఒప్పందంపై సంతకం చేయాలి. ఒకవేళ ఫ్రాంచైజ్ టీం పేమెంట్ చేయడంలో విఫలమైతే, BCCI జోక్యం చేసుకుని పేమెంట్ జరిగేల చూస్తుంది ఇంకా ఫ్రాంచైజ్ సెంట్రల్ రెవెన్యూ ఫండ్ నుండి అవసరమైన మొత్తాన్ని కట్ చేస్తుంది.
నిపుణుల అభిప్రాయం: బిజినెస్ టుడే రిపోర్ట్ ప్రకారం ఐపీఎల్ ఫ్రాంచైజీలు ప్లేయర్లకు చెల్లించే మొత్తాన్ని వృత్తిపరమైన ఆదాయంగా లెక్కిస్తారు. అందువల్ల IPL నుండి వచ్చే ఆదాయాలను ఒక ఆర్థిక సంవత్సరం మొత్తం ఆదాయానికి కలిపి భారత ఆదాయపు పన్ను చట్టం కింద పన్ను స్లాబ్‌ల ప్రకారం పన్ను విధించబడుతుంది.
విదేశీ ఆటగాళ్లకు పన్ను నియమాలు: విదేశీ ఆటగాళ్లకు భారత ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 115BBA కింద పన్ను విధించబడుతుంది. ఈ సెక్షన్ ప్రకారం భారత పౌరుడు కానీ (NRI) ఆటగాళ్లకు భారతదేశంలో ఏదైనా స్పోర్ట్స్ లేదా సంబంధిత కార్యక్రమంలో పాల్గొంటే అతనికి ప్రత్యేక నియమాలు వర్తిస్తాయి. ముఖ్యంగా భారతదేశంలో స్పోర్ట్స్, ప్రకటనలు లేదా క్రీడలకు సంబంధించిన ప్రొమోషన్స్ నుండి వచ్చే ఆదాయానికి 20% ఫ్లాట్ రేటుతో పన్ను విధించబడుతుంది. అదనంగా ఈ ఆటగాళ్ళు భారతదేశంలో ఆదాయాన్ని పొందినప్పుడు, దానిపై 20% TDS కూడా వర్తిస్తుంది.
విదేశీ ఆటగాళ్ళు భారతదేశంలో 'డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్' (DTAA) కింద ట్యాక్స్ రిలీఫ్ పొందే అవకాశం ఉంది. ఒక ప్లేయర్ ఒక ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో 182 రోజుల కంటే ఎక్కువ రోజులు గడిపినట్లయితే అతన్ని భారత 'నివాసి'గా పరిగణిస్తారు అంటే భారత పౌరులలాగానే పన్ను నియమాలకు లోబడి ఉంటారు అని అర్ధం.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications