Reliance Power: అంబానీ సోదరుడు ఒకప్పటి బిలియనీర్ అనిల్ అంబానీకి రోజులు అస్సలు కలిసి రావట్లేదు. తిరిగి తన గత వైభవాన్ని సంతరించుకోవటానికి ప్రస్తుతం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో అనిల్ అంబానీకి కొన్ని సానుకూల వార్తలతో పాటు షాక్స్ కూడా వస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లడుకోబోతున్నది రిలయన్స్ పవర్ కంపెనీ షేర్ల గురించే. తాజాగా రిలయన్స్ పవర్ అనుబంధ సంస్థ రోసా పవర్ సింగపూర్‌కు చెందిన వెర్డే పార్ట్‌నర్స్‌కు మరో రూ.485 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించింది. దీంతో రోజా పవర్ సున్నా రుణ స్థాయికి చేరుకుంది. వాస్తవానికి నిర్ణీత గడువు కంటే ముందుగానే రిలయన్స్ అనుబంధ సంస్థ రూ.1,318 కోట్లను చెల్లించినట్లు కంపెనీ ప్రకటించింది. గతంలో దీనికి సంబంధించి రూ.833 కోట్లను చెల్లించగా మిగిలిన భాగాన్ని తాజాగా చెల్లించినట్లు వెల్లడైంది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ సమీపంలో రోజా పవర్ 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రోసా పవర్ ఇటీవల జారీ చేసిన రూ.1,525 కోట్ల విలువైన ఈక్విటీ-లింక్డ్ వారెంట్‌లతో పాటు, క్లీన్ గ్రీన్ పునరుత్పాదక ఇంధన రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రిలయన్స్ పవర్‌కు తోడ్పాటునిస్తుంది.

ఈ వార్తతో ఇంట్రాడేలో రిలయన్స్ పవర్ షేర్లు 3 శాతానికిపైగా లాభంతో ఎన్ఎస్ఈలో రూ.45 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీ బొగ్గు, గ్యాస్, జలవిద్యుత్ మరియు పునరుత్పాదక ఇంధనంపై ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుల అతిపెద్ద పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. అలాగే రిలయన్స్ పవర్ 5,300 మెగావాట్ల కార్యాచరణ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. నిన్న అమెరికా ఎన్నికలతో భారతీయ స్టాక్ మార్కెట్లు భారీగా ర్యాలీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిలయన్స్ పవర్ కంపెనీ షేర్లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకాయి. కంపెనీ ఇటీవల నిర్వహించిన ప్రిఫరెన్షియల్ షేర్ల జారీతో నికర విలువ రూ.11,155 కోట్ల నుంచి రూ.12,680 కోట్లకు పెరగనుంది.
అనిల్ అంబానీపై బ్యాన్..!
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు నకిలీ బ్యాంక్ గ్యారెంటీలు సమర్పించినట్లు తేలిన తర్వాత మూడేళ్లపాటు టెండర్లలో బిడ్డింగ్ చేయకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిషేధించింది. చివరి రౌండ్ బిడ్డింగ్‌లో సమర్పించిన నకిలీ బ్యాంక్ గ్యారెంటీల కారణంగా ఈ డిబార్‌మెంట్ జరిగిందని SECI గురువారం ప్రకటించింది. ప్రస్తుతం మహారాష్ట్ర ఎనర్జీ జనరేషన్ లిమిటెడ్‌గా పిలవబడే.. గతంలో రిలయన్స్ ఎన్‌యు బీఎస్ఈ లిమిటెడ్ సమర్పించిన పత్రాల ఆధారంగా, డబ్బు డిపాజిట్‌కు వ్యతిరేకంగా బ్యాంక్ గ్యారెంటీఎండార్స్‌మెంట్ నకిలీదని తేలిందని సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఈ క్రమంలో పేర్కొంది. గ్రీన్ ఎనర్జీపై ప్రస్తుతం అనిల్ అంబానీ రిలయన్స్ పవర్ దృష్టి సారిస్తున్న వేళ ఈ వేటు పెద్ద నష్టాన్ని కలిగించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications