ముంబై: పబ్లిక్ సెగ్మెంట్‌లో లీడ్ బ్యాంక్‌గా ఉంటోన్న స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై తన వడ్డీ రేటును పెంచింది. 20 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. పెంచిన వడ్డీ రేట్లను 2 కోట్ల రూపాయలకు దిగువగా ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లకు వర్తింపజేసింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రెపో రేటును కొద్దిరోజుల వ్యవధిలో ఎస్బీఐ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇవ్వాళ్టి నుంచే పెంచిన వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి.

వడ్డీ రేట్లు ఇలా..
వివిధ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్ల వివరాలు ఇలా ఉన్నాయి. 7 నుంచి 45 రోజుల వరకు: సాధారణ ప్రజలకు- 2.90 శాతం, సీనియర్ సిటిజన్లకు 3.40 శాతం. 46 నుంచి 179 రోజుల వరకు: సాధారణ ప్రజలకు- 3.90 శాతం, సీనియర్ సిటిజన్లకు 4.40 శాతం. 180 నుంచి ఏడాదిలోపులో సాధారణ ప్రజలకు- 4.60 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.10 శాతం పెంచింది.

పదేళ్లలోపు..
ఏడాది నుంచి రెండు సంవత్సరాల్లోపులో సాధారణ ప్రజలకు- 5.30 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.80 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. రెండేళ్ల నుంచి మూడు సంవత్సరాలలోపు సాధారణ ప్రజలకు- 5.35 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.85 శాతం. మూడేళ్ల నుంచి అయిదు సంవత్సరాల్లోపులో సాధారణ ప్రజలకు- 5.45 శాతం, సీనియర్ సిటిజన్లకు 5.95 శాతం ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును వర్తింపజేసింది. అయిదేళ్ల నుంచి 10 సంవత్సరం లోపులో సాధారణ ప్రజలకు- 5.50 శాతం, సీనియర్ సిటిజన్లకు 6.30 శాతం వడ్డీ ఉంటుంది.

ఆర్బీఐ పెంపు మేరకు..
ఈ నెల 8వ తేదీన భారతీయ రిజర్వు బ్యాంక్.. తన రేపో రేటును పెంచిన విషయం తెలిసిందే. దీనితో పలు బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. 50 బేసిస్ పాయింట్లను పెంచడం వల్ల రేపో రేట్ 4.90 శాతానికి చేరింది. అంతకుముందు నెలలో కూడా రిజర్వ బ్యాంక్ 40 బేసిస్ పాయింట్లను సవరించింది. దీని ప్రభావంతో బ్యాంకులన్నీ తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును పెంచుకుంటూ వస్తోన్నాయి.

వుయ్ కేర్ పైనా..
సీనియర్ సిటిజన్ల కోసం స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా వుయ్ కేర్ పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్ల పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ కింద ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికి అదనంగా ప్రీమియం అందుతుంది. ఈ ఎఫ్డీలకు 30 బేసిస్ పాయింట్లను పెంచింది. వుయ్ కేర్ (SBI We care) కింద అయిదు నుంచి 10 సంవత్సరాల్లోపు కాల పరిమితి ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లకు దీన్ని వర్తింపజేసింది. 6.30 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు మాత్రమే ఈ వడ్డీ రేటు అందుబాటులో ఉంటుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications