పాన్‌కార్డు ఇక మరింత సులభతరం కానుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేవలం ఆధార్ నెంబర్ ఆధారంగా వెంటనే పాన్‌కార్డును తీసుకోవచ్చునని రెవెన్యూ శాఖ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే అన్నారు. ఆధార్ వివరాలు అందించడం ద్వారా ఆన్‌లైన్ పాన్ కార్డులను తక్షణమే జారీ చేసే సదుపాయాన్ని ఈ నెలలో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు చెప్పారు.

ఇలా ఈ-పాన్ కార్డు తీసుకోవచ్చు
అజయ్ భూషణ్ పాండే చెప్పిన వివరాల ప్రకారం... ఆదాయ పన్ను శాఖ వెబ్‌సైట్‌లో ఆధార్ కార్డు నెంబర్‌ను ఎంటర్ చేయగానే రిజిస్టర్డ్ మొబైల్‌కు వన్ టైమ్ పాస్ వర్డ్ (OTP) వస్తుంది. OTPని ఎంట్రీ చేశాక ఆధార్ వివరాల పరిశీలన జరుగుతుంది. ఆ వెంటనే ఈ-పాన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ నెలాఖరు నాటికే నూతన సేవలను అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ట్యాక్స్ పేయర్స్‌కు ఇబ్బందులు తప్పుతాయి
ఈ ప్రక్రియ ద్వారా ట్యాక్స్ పేయర్స్ దరఖాస్తు ఫారాల్ని నింపి ఆదాయపు పన్ను శాఖకు సమర్పించే ఇబ్బందులు తప్పుతాయని అజయ్ భూషణ్ పాండే చెప్పారు. అలాగే అధికారులు పన్ను చెల్లింపుదారుల ఇంటికి పాన్‌కార్డులను పంపించే ప్రక్రియ సులభతరం అవుతుందన్నారు.

పాన్-ఆధార్ అనుసంధానికి మార్చి 31 చివరి తేదీ
కేంద్ర ప్రభుత్వంపాన్-ఆధార్ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేసింది. ఇప్పటి వరకు 30.75 కోట్లకు పైగా పాన్ కార్డులు- ఆధార్ కార్డుతో అనుసంధానమయ్యాయి. 2020 జనవరి 27 నాటికి ఇంకా 17.58 కోట్ల పాన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానం కావాల్సి ఉంది. పాన్-ఆధార్ అనుసంధానానికి ఈ ఏడాది మార్చి 31 చివరి గడువు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications