For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సై ... డాట్ ఆర్గ్ నీదా ... నాదా! డాట్ ఆర్గ్ పై బిలియన్ డాలర్ బెట్టు!

|

ఇంటర్నెట్ వినియోగం తెలిసిన వారికి డాట్ ఆర్గ్ ను వేరేగా పరిచయం చేయనక్కర లేదు. ఎందుకంటే లాభాపేక్ష లేని సంస్థలు (నాన్-ప్రాఫిట్ ఆర్గనైజషన్స్) డాట్ కాం కు బదులు వాటి ఇంటర్నెట్ డొమైన్ తర్వాత డాట్ ఆర్గ్ ను కలిగి ఉంటాయి. ఉదాహరణకు ఐక్యరాజ్య సమితి (యునైటెడ్ నేషన్స్), వికీపీడియా వంటి సంస్థలు అన్నమాట. అయితే, ఇప్పుడు డాట్ ఆర్గ్ ఎవరికి దక్కాలి అనే అంశంపై అమెరికాలో ఒక పెద్ద యుద్ధమే నడుస్తోంది. డాట్ ఆర్గ్ అంటే 'ఆర్గనైజషన్' అని అర్థం. దీన్ని చాలా వరకు ఎన్జీఓ లు (నాన్-గవర్నమెంట్ ఆర్గనైజషన్స్), నాన్-ప్రాఫిట్ ఆర్గనైజషన్స్ వాడుతుంటాయి.

ఆ పేరును బట్టి వినియోగదారులు కూడా సదరు సంస్థ కార్యకలాపాలను అంచనా వేస్తారు. అయితే, ప్రస్తుతం డాట్ ఆర్గ్ రిజిస్ట్రీ బాధ్యతలు చూసే సంస్థ ను అమెరికా కు చెందిన ప్రముఖ ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ ఎథోస్ కాపిటల్ కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం ఏకంగా రూ 7,000 కోట్లు ( 1 బిల్లియన్ డాలర్లు) చెల్లించేందుకు ముందుకు వచ్చింది. కానీ దీనికి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురవుతోంది. ఈ విషయాన్నీ ది న్యూ యార్క్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది.

<strong>IRCTC tatkal: తత్కాల్ బుకింగ్ రూల్స్, టైమింగ్స్, ఛార్జీలు</strong>IRCTC tatkal: తత్కాల్ బుకింగ్ రూల్స్, టైమింగ్స్, ఛార్జీలు

కొంటే నష్టమేమిటి...

కొంటే నష్టమేమిటి...

పబ్లిక్ ఇంటర్నెట్ రిజిస్ట్రీ కి డాట్ ఆర్గ్ పేర్ల ను కేటాయించే అధికారాన్ని ఇంటర్నెట్ సొసైటీ దాఖలు చేసింది. 1998 లో ఏర్పాటైన ఈ సంస్థకు గతేది మరో 10 ఏళ్ళ వరకు డాట్ ఆర్గ్ డొమైన్ నేమ్స్ కేటాయించే అవకాశం ఉంటుంది. సహజంగా డాట్ కామ్ వంటి వెబ్సైటు డొమైన్ నేమ్స్ చాలా ఖరీదు ఉంటాయి. పేర్లకు ఉన్న డిమాండ్, డొమైన్ లోని అక్షరాల ప్రకారం రూ 1,000 నుంచి రూ 50,00,000 లక్షల ధర కూడా పలుకుతాయి. కానీ డాట్ ఆర్గ్ అలా కాదు. రూ 700 నుంచి రూ 1,400 వరకే ఉంటాయి. ఎందుకంటే... ఇది కూడా లాభాపేక్ష లేకుండా నడిచే సంస్థ కాబట్టి... ప్రపంచంలోని నాన్-ప్రాఫిట్ ఆర్గనైజషన్స్ కు తక్కువ ధరలో ఇంటర్నెట్ డొమైన్స్ లభించాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తుంది కాబట్టి. కానీ దీనిని ఎథోస్ కాపిటల్ కొనుగోలు చేస్తే... తన సొంత లాభం కోసం డొమైన్ ధరలు పెంచేస్తుంది. అదే సమయంలో యూజర్ల డేటా ను కూడా విక్రయించే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు.

పోటీకి ఒక సొసైటీ ఏర్పాటు..

పోటీకి ఒక సొసైటీ ఏర్పాటు..

పబ్లిక్ ఇంటర్నెట్ రిజిస్ట్రీ ని ఎథోస్ కాపిటల్ కొనుగోలు చేయకుండా అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగా ఒక కొత్త సొసైటీ ఏర్పాటవుతోంది. ఇంటర్నెట్ రంగంలో విశిష్ట సేవలు అందించిన వారు కలిసి ది కో-ఓపెరటివ్ కార్పొరేషన్ ఆఫ్ డాట్ ఆర్గ్ రెజిస్ట్రన్ట్స్ అనే పేరుతో ఒక కో-ఓపెరటివే ను ఏర్పాటు చేస్తున్నారు. ఇంటర్నెట్ కార్పొరేషన్ ఫర్ అసైన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్ (ఐసిఏఎన్ఎన్) నుంచి డాట్ ఆర్గ్ నిర్వహణ బాధ్యతలు చూసుకోవటంతో పాటు దాన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు విక్రయించకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ సొసైటీ ని ఏర్పాటు చేస్తున్నారు.

కోటి కి పైగా డాట్ ఆర్గ్ లు ...

కోటి కి పైగా డాట్ ఆర్గ్ లు ...

ఇప్పటి వరకు కోటి కి పైగా డాట్ ఆర్గ్ డొమైన్స్ వివిధ సంస్థలకు కేటాయించారు. వీటన్నింటిపై ప్రస్తుత కొనుగోలు ప్రభావం పడబోతోంది. ఒక వేల ఎథోస్ కాపిటల్ డాట్ ఆర్గ్ బాధ్యతలు చేపడితే ... ధరల పెరుగుదలతో పాటు అనేక అంశాల్లో నాన్-ప్రాఫిట్ ఆర్గనైజషన్స్ కంప్రమైజ్ కావాల్సి ఉంటుందని దీనిని వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు. అయితే, ఎథోస్ కాపిటల్ చెల్లించే మొత్తం తో సంస్థను నడపటం సులువు అని కూడా కొందరి అభిప్రాయం. ఇదిలా ఉండగా... తాము మాత్రం డాట్ ఆర్గ్ కొనుగోలు అనంతరం 10% నికి మించి ధరలు పెంచబోమని, ఏదైనా కొత్త మార్పు వస్తున్నప్పడు వ్యతిరేకత సహజమేనని ఎథోస్ కాపిటల్ ఫౌండర్ పేర్కొంటున్నారు. చూడాలి మరి ఎవరి పంతం నెగ్గేనో .... డాట్ ఆర్గ్ ఎవరికి దక్కేనో!

English summary

సై ... డాట్ ఆర్గ్ నీదా ... నాదా! డాట్ ఆర్గ్ పై బిలియన్ డాలర్ బెట్టు! | Inside the billion-dollar battle over .org

Ethos Capital, a private equity firm, announced that it planned to buy the rights to a tract of internet real estate for more than $1 billion
Story first published: Monday, January 13, 2020, 21:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X