దేశంలో లోక్ సభ ఎన్నికలు కొనసాగుతోన్నాయి. ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగిసింది. మరో 5 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీజేపీ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే వారసత్వపు పన్నుపై దేశంలో చర్చ మొదలైంది. ప్రజలు తమ పిల్లల కోసం వదిలిపెట్టిన ఆస్తులను లాక్కోవడానికి కాంగ్రెస్ పార్టీ 55% వరకు వారసత్వ పన్ను రేట్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఆరోపించారు.
కాంగ్రెస్.. ప్రధాని చేసిన ఆరోపణలను ఖండించింది. దేశంలో పెరుగుతున్న సంపద అసమానతపై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే వారసత్వ పన్ను పై ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. దేశంలో ప్రస్తుతం రెండు విధాలుగా పన్ను చెల్లింపులు కొనసాగుతోన్నాయి. ఒకటి ప్రత్యక్ష పన్ను, రెండోది పరోక్ష పన్ను. పరోక్ష పన్ను దేశంలో ఉన్న అందరిపై పడుతోంది. వస్తువులు, సేవల కొనుగోలు, విక్రయాలపై ప్రతి పౌరుడి పరోక్ష పన్ను చెల్లిస్తాడు.

ప్రత్యక్ష పన్ను ఐటీ ఫైల్ చేసే వారే చెల్లిస్తారు. ఇక్కడ, వ్యక్తులు, కార్పొరేట్లు నేరుగా ఆదాయపు పన్ను శాఖకు పన్నులు చెల్లిస్తారు. దేశంలో
1953 ఎస్టేట్ డ్యూటీ యాక్ట్ ప్రకారం వారసత్వ పన్ను విధించారు. ఆర్థిక అసమానతలను తొలగించేందుకు దీన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత దీన్ని రద్దు చేశారు. తాజాగా ఎన్నికల సందర్భంగా ఈ అంశంపై తెర పైకి వచ్చింది. అమెరికాలో 2023 చివరి నాటికి దాదాపు ఆరు రాష్ట్రాలు వారసత్వ పన్నును విధిస్తున్నాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications