ఐకియా రిటైల్ వ్యవహారాలు నిర్వహించే ఇంగ్‌కా గ్రూప్ భారత్‌లో 'మీటింగ్ ప్లేస్' కాన్సెప్టుతో షాపింగ్ మాల్ ఏర్పాటుకు సిద్దమైంది. రూ.5,500కోట్లుతో నోయిడాలో మాల్ ఏర్పాటు చేయనుంది. దీంతో ఇంగ్‌కా ఆస్తుల జాబితాలో మరో మాల్ చేరనుంది. ఇప్పటికే ఇంగ్‌కా సంస్థకు యూరోప్,రష్యా,చైనాల్లో 45 భారీ షాపింగ్స్ మాల్స్ ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లోని హైదరాబాద్,నేవీ ముంబైల్లో ఉన్న ఐకియా స్టోర్స్ కూడా ఇంగ్‌కా గ్రూపువే కావడం గమనార్హం. ఈ ఐకియా స్టోర్స్ విస్తీర్ణం 4లక్షల చదరపు మీటర్లు.
ఈ ఏడాది అమెరికా మార్కెట్లోకి కూడా ప్రవేశించాలని ఇంగ్‌కా గ్రూప్ యోచిస్తోంది. ఇక భారత్‌లోని నోయిడాలో ఇంగ్‌కా నిర్మించతలపెట్టిన మాల్ రెండు లేదా మూడేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం 48వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు. భారత్‌లో రిటైల్ మార్కెట్‌కు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం చాలా ముఖ్యమైనదని... అందుకే ఈ ప్రాంతంలో ఇంగ్‌కా మాల్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు ఐకియా ఇండియా సీఈవో పీటర్ బెట్జెల్ తెలిపారు. మీటింగ్ ప్లేస్ కాన్సెప్టుతో ఏర్పాటయ్యే ఈ మాల్ సాధారణ మాల్స్‌కు చాలా భిన్నంగా ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరుపున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.

రాబోయే రోజుల్లో భారత్‌లో ఐకియాను 100 మిలియన్ల ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో తమ విస్తరణ ఉండనున్నట్లు తెలిపారు. ముంబైలో ఐకియా రెండు చిన్న స్టోర్స్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్,ముంబై,పుణే నగరాల్లో ఆన్‌లైన్ స్టోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది. త్వరలోనే బెంగళూరుకు కూడా తమ స్టోర్స్‌ను విస్తరించాలని భావిస్తోంది.
More From GoodReturns

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications