For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

150 మిలియన్ డాలర్ల ఖర్చు తగ్గింపు, ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ వెల్‌కం!

|

బెంగళూరు: టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కంపెనీ వ్యయాలు తగ్గించుకునే ఉద్దేశ్యంలో భాగంగా కొంతమందిని తొలగించనుందని తెలుస్తోంది. ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 100 మిలియన్ డాలర్ల నుంచి 150 మిలియన్ డాలర్ల ఖర్చును తగ్గించుకోవాలని చూస్తోంది. ఉద్యోగంలో ఫ్రెషర్స్‌ను చేర్చుకోవడం ద్వారా కూడా ఖర్చను తగ్గించుకోవాలనుకుంటోంది.

కాస్ట్ ఆప్టిమైజేషన్ కోసం 21 ట్రాక్స్‌ను పరిశీలిస్తున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 100 మిలియన్ డాలర్ల నుంచి 150 మిలియన్ డాలర్ల వరకు ఆదా చేయాలని చూస్తున్నామని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) నీలాజన్ రాయ్ అన్నారు. ఇందులో భాగంగా ఫ్రెషర్స్‌ను నియమించాలని చూస్తున్నట్లు చెప్పారు. కొత్త మౌలిక సదుపాయాల కోసం అసెట్ లైట్ మోడల్‌కు షిఫ్ట్ అవుతున్నట్లు చెప్పారు.

ఇన్ఫోసిస్ భారీ షాక్: 12,000 ఉద్యోగుల తొలగింపు, ఏ స్థాయిలో ఎంతమంది అంటే?ఇన్ఫోసిస్ భారీ షాక్: 12,000 ఉద్యోగుల తొలగింపు, ఏ స్థాయిలో ఎంతమంది అంటే?

Infosys to recruit more freshers, aims to cut costs up to dollar 150 million

తమ కంపెనీ అమెరికా, యూరప్‌లలో ఏడాది కాలంల 1,700 మంది ఉద్యోగులను తీసుకుందని చెప్పారు. కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా ఉద్యోగులనుతొలగిస్తారనే ప్రచారాన్ని ఇన్ఫోసిస్ కొట్టి పారేసింది.

లేఆఫ్ ఆలోచన లేదని, కేవలం పర్ఫార్మెన్స్ రివ్యూ మత్రమే ఉందని, మంచి ప్రదర్శన కనబరచకుంటే వెళ్లిపోమని చెప్పడం సహజమేనని, కానీ కాస్ట్ కట్టింగ్‌లో భాగంగా తొలగింపు మాత్రం లేదని చెబుతున్నారు.

English summary

150 మిలియన్ డాలర్ల ఖర్చు తగ్గింపు, ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ వెల్‌కం! | Infosys to recruit more freshers, aims to cut costs up to dollar 150 million

Infosys CEO Nilanjan Roy said that the company was geared towards bettering the bottom-end of its pyramid, which had become more barrel-shaped, by recruiting freshers.
Story first published: Thursday, November 7, 2019, 14:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X