Infosys News: ఐటీ ఉద్యోగం అనగానే లక్షల్లో శాలరీలు, లగ్జరీ జీవితం జీవితం మస్త్ ఖుషీ ఉంటది అని చాలా మంది అనుకుంటుంటారు. పైగా ఈ రోజుల్లో టెక్కీలకు హైప్ బాగా ఉంది. పెళ్లి కావాలంటే ముందుగా వరుడిని అడుగుతున్న క్వాలిఫికేషన్ సాఫ్ట్‌వేర్ జాబ్, ఎన్ని లక్షల ప్యాకేజీ అన్నదే. వాస్తవానికి టెక్కీలు ఎదుర్కొనే ఇబ్బందులు, వారికి ఉండే ప్రెజర్ వంటి అంశాలను చాలా తక్కువగా పట్టించుకుంటున్నారు.
అయితే టెక్కీలకు ఉండే కష్టాలను వివరిస్తున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. కెనడాలో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన ఐటీ ఉద్యోగి రూ.70 లక్షల జీతం సరిపోదని చెబుతున్న వీడియో ప్రస్తుతం పెద్ద సంచలనంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ఐటీ కంపెనీలు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్న వేళ ఈ క్రమంలో కంపెనీలు తమ ఉద్యోగులను అమెరికా, కెనడా వంటి దేశాలకు ఆన్‌సైట్ పని కోసం పంపిస్తుంటాయని తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది అక్కడే క్రమంగా స్థిరపడిపోతుంటారు. ఇలాంటి క్రమంలో అక్కడి జీనవశైలి, అక్కడి స్థానిక ఖర్చులకు ఏడాది రూ.70 లక్షల జీతం అస్సలు తమకు సరిపోవటం లేదనంటూ భారత్‌కు చెందిన ఓ ఐటీ ఉద్యోగి వీడియోలో వాపోయాడు.

కెనడాలో నివసిస్తున్న భారతీయ టెక్ ఉద్యోగిని పీయూష్ మోంగా ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో సదరు ఉద్యోగి తన జీతం కెనడాలో ఏడాదికి 1,15,000 కెనడియన్ డాలర్లుగా ఉందని పేర్కొన్నాడు. ఇది భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం రూ.70 లక్షలకు సమానం. ప్రస్తుతం తాను ఇన్ఫోసిస్ కంపెనీ కోసం పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. తాను టొరంటో నగరంలో నివసిస్తున్నానని అక్కడి ఖర్చులకు వస్తున్న జీతం ఏమాత్రం సరిపోవటం లేదని పేర్కొన్నాడు. ఈ క్రమంలో తాను కేవలం ఇంటి అద్దె కోసమే నెలకు నాలుగు వేల డాలర్లు చెల్లిస్తున్నట్లు వెల్లడించాడు.
ఇన్ఫోసిస్ కంపెనీలో SAP స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్న తనకు ఏడాదికి 1.15 లక్షల డాలర్లు వేతనంగా అందుకుంటున్నట్లు సదరు వ్యక్తి ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఈ జంట తమ అడుగుజాడల్లో ఇతరులు ఎలా అనుసరించాలనే దానిపై విలువైన సలహాలను కూడా అందించారు. ఇన్ఫోసిస్ చాలా మంది అసోసియేట్లను అమెరికాకు పంపింది. కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ సమస్య కారణంగా చాలా మంది ఏడాదిలోపే కంపెనీని విడిచిపెట్టారని తెలిపారు. దీనిపై ఒక యూజర్ స్పందిస్తూ.. ప్రజలకు ఎంత డబ్బు వచ్చినా సరిపోదు. మీరు కెనడాలో ఉన్నారు. భారతదేశం కంటే జీవన ప్రమాణం 20 రెట్లు మెరుగ్గా ఉంది. కాబట్టి ఆనందించండి అంటూ కామెంట్ చేశాడు. ఇదే క్రమంలో మరో యూజర్ ఇంటి అద్దెకు 4000 డాలర్లు చెల్లించటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications