IT News: ఒక పక్క అమెరికాలోని టెక్ కంపెనీలు క్రమంగా ఉద్యోగుల కోతలను ప్రకటిస్తుంటే.. భారత ఐటీ కంపెనీల పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న యువతకు ఇది చాలా పెద్ద సమస్యగా మారుతోంది. వాస్తవ పరిస్థితులను గమనిస్తే..
అంత్జాతీయ ఆర్థిక మందగమనంతో దేశంలోని ఐటీ సేవల కంపెనీలకు ఆర్డర్లు గతంలో కంటే తగ్గుతున్నాయి. ఈ ప్రభావం మార్జిన్లపైన, లాభదాయకతపై కూడా పడుతోంది. దీంతో కంపెనీలు తాత్కాలికంగా కొత్త నియామకాలను నిలిపివేయగా.. వేల సంఖ్యలో ఉద్యోగులు బెంచ్ పై కొనసాగుతున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ వంటి కంపెనీల ఇటీవలి ఫలితాలు కూడా మారుతున్న పరిణామాలను ప్రతిబింబిస్తున్నాయి. ఇన్వెస్టర్లు, మార్కెట్లు వీటితో అస్సలు సంతృప్తిగా లేరు.

నియామకాలను పరిశీలిస్తే.. గత ఏడాది టీసీఎస్ కేవలం 22,600 మందిని మాత్రమే కొత్తగా నియమించుకుంది. అయితే 2022 ఆర్థిక సంవత్సరంలో ఇవి 1,03,000గా ఉన్నాయి. అంటే ఏకంగా 78 శాతం నియామకాలను ఐటీ దిగ్గజం తగ్గించింది. ఇలాంటి పరిస్థితులే మనకు ఇన్ఫోసిస్ విషయంలోనూ కనిపిస్తున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కేవలం 29,219 మందిని రిక్రూట్ చేసుకోగా.. అంతకు ముందు ఏడాది ఈ సంఖ్య 54,396గా ఉంది. అంటే నియామకాలు 46 శాతం తగ్గాయి. ఇక హెచ్సీఎల్ టెక్నాలజీస్ సైతం నియామకాల్లో 57 శాతం క్షీణతను నమోదు చేసింది.
ఐటీ రంగంలోని అంతర్గత వ్యక్తులు చెబుతున్న దాని ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం కూడా నియామకాలు స్తబ్ధుగానే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. హెచ్‌సీఎల్‌టెక్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామ్ సుందరరాజన్ క్యూ4 ఎర్నింగ్స్ కాల్‌లో మాట్లాడుతూ.. రానున్న కొన్ని త్రైమాసికాల్లో నియామకాలు మోడరేట్‌గా ఉంటాయని చెప్పారు. ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నీలంజన్ రాయ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
2024 ఆర్థిక సంవత్సరంలో నియామకాలు 20-25 శాతం తగ్గుతాయని టాలెంట్ సొల్యూషన్స్ కంపెనీ ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్ నివేదిక పేర్కొంది. ఐటి సేవలకు డిమాండ్ తగ్గడం వల్ల నియామకాలు తగ్గడమే కాకుండా ఫ్రెషర్‌ల ఆన్‌బోర్డింగ్‌లో ఆలస్యం.. మెజారిటీ భారతీయ ఐటీ కంపెనీల్లో బెంచ్‌పై ఉన్న టెక్కీల సంఖ్య పెరిగింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications