ముంబై: దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ ఇన్పోసిస్.. తన రెండో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలను కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. అంచనాలకు అనుగుణంగా రాణించిందీ కంపెనీ. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మెజారిటీ ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కే పరిమితమైన ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్ఫోసిస్.. సత్తా చాటింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 10 శాతానికి పైగా నెట్ ప్రాఫిట్‌ను నమోదు చేసింది.
వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ నాటికి ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2021-2022 రెండో త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 11.9 శాతం మేర ప్రాఫిట్‌ను రికార్డు చేసింది. జులై-ఆగస్టు-సెప్టెంబర్ మధ్యకాలంలో 5,421 కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్ ప్రాఫిట్‌ను అందుకుంది. ఇదే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంతో పోల్చుకుంటే.. 4.4 శాతం మేర పురోభివృద్ధిని కనపరిచింది. ఏప్రిల్-మే-జూన్ మధ్యకాలంలో 5,195 కోట్ల రూపాయల ప్రాఫిట్‌ను అందుకోగా.. రెండో త్రైమాసికానికి ఈ మొత్తం పెరిగింది. 5,421 కోట్ల రూపాయలకు చేరింది.

మొత్తంగా ఈ రెండో త్రైమాసికంలో 29,602 కోట్ల రూపాయల మేర ఆర్థిక లావాదేవీలను నిర్వహించింది. తొలి త్రైమాసికంతో పోల్చుకుంటే.. ఈ మొత్తం 20 శాతం అధికం. తొలి త్రైమాసికంలో 27,896 కోట్ల రూపాయలను లావాదేవీలను రికార్డు చేయగా.. ఈ సంఖ్య 29,602 కోట్ల రూపాయలకు చేరింది. రెండో త్రైమాసికం ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని ఇన్ఫోసిస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి సలీల్ పరేఖ్ వ్యాఖ్యానించారు. షేర్ బైబ్యాక్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నామని అన్నారు. ఒక్కో షేర్‌పై మధ్యంతర డివిడెండ్‌ను 15 శాతం మేర ఉందని పేర్కొన్నారు.
వచ్చే ఆరు నెలల కాలంలో పెద్ద ఎత్తున నియామకాలను కూడా చేపట్టబోతున్నామని ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు తెలిపారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను హైర్ చేసుకోవాల్సి ఉందని చెప్పారు. కనీసం 45,000 మందిని నియమించుకోవడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశామని అన్నారు. మరోవంక- ఇన్ఫోసిస్ షేర్లలో కూడా పురోగతి కనిపించింది. తొలి త్రైమాసికంతో పోల్చుకుంటే.. ఏడు శాతం మేర పెరిగాయి షేర్ల వ్యాల్యూ.


Click it and Unblock the Notifications