కొత్త ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ సమస్యలను పరిష్కరిస్తున్నామని ఇన్ఫోసిస్ శనివారం వెల్లడించింది. ఈ కొత్త పోర్టల్ ద్వారా 1 లక్షకు పైగా ఫైల్ రిటర్న్స్ నమోదయినట్లు తెలిపింది. ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్ కొత్త పోర్టల్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా కలిగిన అసౌకర్యానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. పన్ను చెల్లింపుదారులకు మరింత సౌలభ్యంగా ఉండేలా జూన్ 7వ తేదీన తీసుకు వచ్చిన పోర్టల్‌లో తలెత్తిన పలు సమస్యలను పరిష్కరించినట్లు సీఓఓ యూబీ ప్రవీణ్ రావు తెలిపారు.
మరిన్ని సమస్యను కొద్ది వారాల్లో పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికే లక్ష రిటర్న్స్ ఫైల్ అయినట్లు చెప్పారు. యూబీ ప్రవీణ్ రావు 40వ యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో వర్చువల్ సదస్సులో మాట్లాడారు. 'గత వారం రోజులుగా సాంకేతిక సమస్యలు వచ్చాయి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేవారికి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే కొన్ని సమస్యలను పరిష్కరించాం. మరిన్ని కొద్ది రోజుల్లో పరిష్కరిస్తాం. ఈ పోర్టల్‌లో ప్రతిరోజు లక్షలాదిమంది ఉంటున్నారు. అంతేకాదు లక్ష వరకు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారు' అని చెప్పారు.

కొత్త ట్యాక్స్ పేయర్ ఫ్రెండ్లీ ఈ-ఫైలింగ్ పోర్టల్ నేటి (జూన్ 7) నుండి అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇన్ఫోసిస్ దృష్టికి తీసుకు వెళ్లారు. సమస్యలు తలెత్తుతున్నాయని యూజర్లు భారీ ఎత్తున నిర్మలమ్మకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశారు.
More From GoodReturns

New rules: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్! మీ శాలరీ, టాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు!

Form 16: ఫామ్-16 స్థానంలో ఫామ్-130.. మీ శాలరీ, టాక్స్ వివరాల్లో రాబోతున్న పెద్ద మార్పులివే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications