IT News: AIపై కీలక ప్రకటన చేసిన ఇన్ఫోసిస్ సీఈవో.. మెగా ప్లాన్ రివీల్.. టెక్కీలు సేఫేనా..?
Infosys News: 2024లో రెండు కొనుగోళ్ల తర్వాత దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ మరిన్ని అక్వజిషన్లపై దృష్టి సారిస్తోంది. ఇటీవలి ఇన్-టెక్ కొనుగోలు తర్వాత కంపెనీ వ్యాపార ఆలోచనలకు అనుకూలమైన సంస్థలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.
కంపెనీ ప్రస్తుతం డేటా అనలిటిక్స్, SAAS వంటి రంగాల్లో కొనుగోళ్లపై కంపెనీ ఆసక్తిగా ఉన్నట్లు సీఈవో సలీల్ పరేఖ్ వెల్లడించారు. ఈ క్రమంలో యూరప్, అమెరికాలోని కొన్ని భౌగోళిక ప్రాంతాలను పరిశీలించవచ్చని అన్నారు. జనవరిలో ఇన్ఫోసిస్ భారతదేశంలో ప్రధాన కార్యాలయం కలిగిన సెమీకండక్టర్ డిజైన్ సేవల సంస్థ ఇన్ సెమీ టెక్నాలజీ సర్వీసెస్‌లో 100 శాతం ఈక్విటీ షేర్ క్యాపిటల్‌ను రూ.280 కోట్లకు కొనుగోలు చేసేందుకు ఇన్ఫోసిస్ ఖచ్చితమైన ఒప్పందాన్ని ప్రకటించింది. అలాగే ఏప్రిల్‌లో ఇన్ఫోసిస్ జర్మనీ ఇంజనీరింగ్ R&D సేవల్లో ప్రముఖ ప్రొవైడర్ ఇన్-టెక్ హోల్డింగ్‌లో 100 శాతం ఈక్విటీ షేర్ క్యాపిటల్‌ను రూ.4,045 కోట్లకు కొనుగోలును ఖచ్చితమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మరిన్ని కొనుగోళ్లపై దృష్టి సారిస్తోందని.. అయితే ఇవి వ్యూహాత్మక సినర్జీలు, ఆర్థిక వ్యయం, సాంస్కృతిక ఫిట్, ఇంటిగ్రేషన్ అంశాలపై ఆధారపడి ఉంటుందని సీఈవో వెల్లడించారు. జనరేటివ్ ఏఐ గురించి మాట్లాడుతూ ఇన్ఫోసిస్‌లో కూడా GenAIలో భారీ సమీకరణ ఉందని చెప్పారు. మార్కెట్లో సంస్థలు జనరేటివ్ ఏఐ నుంచి ఉత్పన్నమయ్యే ప్రయోజనాలు, వ్యాపార ఫలితాలను అనుభవిస్తున్నందున భవిష్యత్తులో దీని స్వీకరణ మరింతగా పెరుగుతుందని పరేఖ్ అభిప్రాయపడ్డారు.
ఏఐ భవిష్యత్తుపై మాట్లాడుతూ ఇన్ఫోసిస్ క్లయింట్‌ల కోసం 225 జనరేటివ్ AI ప్రోగ్రామ్‌లపై పనిచేస్తున్నట్లు సీఈవో చెప్పారు. ఈ క్రమంలో కంపెనీ ఇప్పటికే 2.5 లక్షల మంది టెక్కీలకు జనరేటివ్ ఏఐపై శిక్షణ ఇచ్చిందని చెప్పారు. ఏఐ సేవలను ప్రస్తుతం టెక్ దిగ్గజం Infosys Topaz ద్వారా తన క్లయింట్లకు అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. అలాగే తొలగింపులపై మాట్లాడుతూ.. న్యూ ఏజ్ టెక్నాలజీ కారణంగా ఇన్ఫోసిస్‌లో ఎటువంటి తొలగింపులు జరగలేదని చెప్పారు. అలాగే ఆర్థిక వాతావరణం మారుతున్నందున కంపెనీ రిక్రూటింగ్‌ను పెంచుతోందని స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications