Infosys News: టెక్ ఫ్రెషర్లకు శుభవార్త.. 20,000 కొత్త రిక్రూట్మెంట్స్, ఎంజాయ్-పండగో
Infosys Jobs: భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా ఐటీ సేవలను అందించటంలో ముందు వరుసలో ఉంది. ఈ క్రమంలో దేశంలో రెండవ అతిపెద్ద టెక్ కంపెనీగా ఉన్న ఇన్ఫోసిస్ తిరిగి తన దూకుడు నియామకాలను ప్రారంభించాలని నిర్ణయించింది.
2025లో అన్నీ శుభశకునములే అన్నట్లుగా పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు కుదుటపడటంతో తిరిగి కొత్త నియామకాలకు సిద్ధం అవుతున్నాయి. ఈ క్రమంలోనే 2026 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 20,000 మంది టెక్ ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది. కంపెనీ ఇటీవల తన మూడవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన తర్వాత ఈ విషయాన్ని బయటపెట్టింది. నాలుగో త్రైమాసికంలో కంపెనీ వేతన పెంపుల వల్ల పెరిగిన ఖర్చులతో కొంత ప్రతికూలతలను చూసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

గురువారం ప్రకటించిన వివరాల ప్రకారం ఇన్ఫోసిస్ తన వార్షిక అమ్మకాల అంచనాను పెంచింది. డిసెంబర్ త్రైమాసికంలో లాభంలో 11.4% పెరుగుదలను నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా క్లయింట్స్ టెక్ ఖర్చులను పెంచేందుకు తగిన బడ్జెట్ అందించటంతో క్రమంగా పునరుద్ధరణను సూచిస్తోందని కంపెనీ పేర్కొంది. ఇది రానున్న కాలంలో కూడా మంచి ఆర్డర్ పైప్ లైన్ అందిస్తుందని వారు భావిస్తున్నారు. కంపెనీ తన ఆదాయంలో దాదాపుగా 80 శాతం పశ్చిమ దేశాల మార్కెట్ నుంచి సంపాదిస్తోంది.
ప్రపంచ భౌగోణిక రాజకీయాలతో పాటు ద్రవ్యోల్బణం కారణంగా భారతీయ టెక్ కంపెనీ ఇన్ఫోసిస్ గడచిన ఏడాది కాలంగా మందగించిన వ్యాపారాన్ని, ఆదాయాలను చూస్తోంది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ తిరిగి మెల్లగా ఐటీ సేవలకు డిమాండ్ పుంజుకోవటాన్ని తిరిగి చూస్తోంది. ద్రవ్యోల్బణం తగ్గుదులతో పాటు వడ్డీ రేట్ల తగ్గింపు వంటి చర్యలు ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటానికి దారితీస్తున్నాయి. ప్రస్తుత ప్రకటన బీటెక్ చివరి ఏడాదిలో ఉన్న విద్యార్థులకు మంచి ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది.
వాస్తవానికి కంపెనీ 2025 ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపు 15,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంది. అయితే టెచ్సీఎల్ టెక్నాలజీస్ ఫ్రెషర్ల నియామకాన్ని 7000కు తగ్గించిన వేళ ఇన్ఫోసిస్ మాత్రం దూకుడుగా ముందుకుసాగుతోందని సీఎఫ్ఓ సంఘ్రాజ్క వెల్లడించారు. అలాగే డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో సెప్టెంబర్ క్వార్టర్ కంటే కంపెనీ ఉద్యోగుల సంఖ్యం దాదాపుగా 5,591 పెరుగుదలను చూసింది. ఇందులో ఫ్రెషర్లతో పాటు లేటరల్ ఎంట్రీ ద్వారా నియామకాలను చేపట్టినట్లు వెల్లడైంది.


Click it and Unblock the Notifications