స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఇన్ఫినిక్స్ జీరో 5జీ (Infinix Zero 5G) లాంచింగ్ తేదీ వచ్చేసింది. హాంకాంగ్‌కు చెందిన ఈ ఇన్ఫినిక్స్.. త్వరలో భారత మార్కెట్‌లో అడుగు పెట్టబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కంప్లీట్ డిజైన్‌ను ఇదివరకే రివీల్ చేసిందీ కంపెనీ. మీడియా టెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్, 13 బ్యాండ్ 5జీ సపోర్ట్‌తో ఈ హ్యాండ్‌సెట్ భారత మార్కెట్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ నెల 14వ తేదీన ఈ స్మార్ట్‌ఫోన్ మొబైల్ హ్యాండ్‌సెట్‌ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ఇన్ఫినిక్స్ యాజమాన్యం ప్రకటించింది.
స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఇన్ఫినిక్స్ జీరో 5జీ (Infinix Zero 5G) లాంచింగ్ తేదీ వచ్చేసింది. హాంకాంగ్‌కు చెందిన ఈ ఇన్ఫినిక్స్.. త్వరలో భారత మార్కెట్‌లో అడుగు పెట్టబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ కంప్లీట్ డిజైన్‌ను ఇదివరకే రివీల్ చేసిందీ కంపెనీ. మీడియా టెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్, 13 బ్యాండ్ 5జీ సపోర్ట్‌తో ఈ హ్యాండ్‌సెట్ భారత మార్కెట్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది.

ఈ నెల 14వ తేదీన ఈ స్మార్ట్‌ఫోన్ మొబైల్ హ్యాండ్‌సెట్‌ను భారత్‌లో విడుదల చేయనున్నట్లు ఇన్ఫినిక్స్ యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు ఇన్ఫినిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనీష్ కపూర్ కొన్ని గ్లింప్సెస్‌ను పోస్ట్ చేశారు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర భారత్‌లో 20,000 రూపాయల కంటే తక్కువే ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. ఇన్ఫినిక్స్ కంపెనీ నుంచి రానున్న మొట్టమొదటి 5జీ సపోర్ట్ స్మార్ట్‌ఫోన్ కావడం వల్ల మంచి అంచనాలే ఉన్నాయి.
దీని గ్లోబల్ ప్రైస్ 350 డాలర్ల వరకు ఉంటోంది. భారత కరెన్సీతో పోల్చుకుంటే దీని విలువ 26,000 రూపాయలకు పైమాటే. 6.7 ఇంచ్ అమోల్డ్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 900 చిప్‌సెట్, 8జీజీ ర్యామ్ 128 జీవీ స్టోరేజ్ దీని సొంతం. ట్రిపుల్ బ్యాక్ కెమెరా సెటప్, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, టెలీఫొటో సెన్సార్, అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కలిగి ఉంది. ఫ్రంట్ కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ ఉండొచ్చని తెలుస్తోంది.

ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ను అమర్చారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో దీన్ని రూపొందించినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. కాగా- స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో పోటీ తీవ్రంగా ఉంటోంది. జియో నెక్స్ట్, శాంసంగ్ గెలాక్సీ, రియల్‌మీ ఎక్స్ సిరీస్, రెడ్ మీ నోట్ 5జీ, వన్ ప్లస్, వీవో టీ1 సిరీస్ వంటివన్నీ మార్కెట్‌ను ముంచెత్తడానికి సిద్ధం అయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఇన్ఫినిక్స్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.


Click it and Unblock the Notifications