దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పై అనేక రాష్ట్రాల్లో యువత వ్యతిరేకిస్తూ.. ఆందోళనలు చేస్తుండటంపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్రా సైతం స్పందించారు. కేంద్రం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ మిలటరీ రిక్రూట్‌మెంట్ పథకంపై కొనసాగుతున్న అశాంతిపై మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా నేడు ఒక ఆఫర్ కూడా ఇచ్చారు. ఈ పథకం కింద శిక్షణ పొందిన యువకులకు మహీంద్రా గ్రూప్ కంపెనీల్లో ఉద్యోగాల్లో నియమించుకుంటామని ప్రకటించారు.
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..
ఈ పథకంపై గత మూడు రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసిన సమయంలో మహీంద్రా ప్రకటన చేయటం కార్పొరేట్ వర్గాల్లో చర్చకు దారితీసింది. అగ్నిపథ్ ప్రోగ్రామ్ చుట్టూ జరుగుతున్న హింసను చూసి తాను ఎలా బాధపడ్డానో వివరిస్తూ మహీంద్రా ట్విట్టర్ వేదికగా స్పందించారు. "గత సంవత్సరం ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు అగ్నివీర్లు పొందే క్రమశిక్షణ & నైపుణ్యాలు వారిని ప్రముఖంగా ఉపాధి పొందేలా చేస్తాయని అన్న మాటలను మరో సారి గుర్తు చేసుకున్నారు. అటువంటి శిక్షణ పొందిన, సమర్థులైన యువకులను రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని మహీంద్రా గ్రూప్ స్వాగతిస్తున్నట్లు ఆయన తన ట్వీట్‌లో ప్రకటించారు. దీనిపై నెటిజన్లు సైతం పలు ప్రశ్నలు అడగగా.. వాటికి మహీంద్రా బదులిచ్చారు కూడా.
అగ్నివీర్స్‌కి మహీంద్రా గ్రూప్ ఏ పదవిని ఇస్తుంది?
మహీంద్రా గ్రూప్ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలా మంది అభినందించారు. అయితే అగ్నివీర్స్‌కు మహీంద్రా గ్రూప్ ఏ పోస్ట్ ఇస్తుందని ఒక నెటిజన్ ఆనంద్ మహీంద్రాను అడిగారు. దీనికి మహీంద్రా బదులిస్తూ.. కార్పొరేట్ రంగంలో అగ్నివీర్లకు ఉపాధికి పెద్ద అవకాశమని బదులిచ్చారు. వారిలోని నాయకత్వం, టీమ్ వర్క్, శారీరక శిక్షణ అగ్నివీర్‌లు మార్కెట్‌కు సిద్ధంగా ఉన్న వృత్తిపరమైన పరిష్కారాలను అందిస్తాయని అభిప్రాయపడ్డారు. కార్యకలాపాల నుంచి పరిపాలన, లాజిస్టిక్స్ నిర్వహణ వరకు పూర్తి స్పెక్ట్రమ్‌ను అగ్ని విభాగాల్లోని ఉద్యోగ అవకాశాలను వీర్లు కవర్ చేయగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు.

అగ్నిపథ్ పథకం వివరాలు..
అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ పథకాన్ని జూన్ 14న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. భారత సాయుధ బలగాల రిక్రూట్‌మెంట్‌లో సమూల మార్పులకు హామీ ఇచ్చే దశగా.. అగ్నిపథ్ పథకం భారత ఆర్మీ, నేవీ, వాయుసేనల్లో 46,000 మంది సైనికులకు అవకాశం కల్పిస్తోంది. కేబినెట్ కమిటీ ఆమోదించిన కొద్దిసేపటికే మీడియా సమావేశంలో ఈ పథకాన్ని రక్షణ మంత్రి ప్రకటించారు. ప్రవేశం ప్రారంభంలో 4 సంవత్సరాల కాలానికి చేయబడుతుంది. ఈ 4 సంవత్సరాల్లో రిక్రూట్ అయిన వారికి అవసరమైన నైపుణ్యాల్లో సాయుధ దళాల ద్వారా శిక్షణ ఇస్తారు. పథకం కింద రిక్రూట్ అయిన వారిని అగ్నివీర్స్ అని అంటారు. అయితే.. భారత ఆర్మీలో చేరాలనుకునే ఆశావహులు ఈ పథకం వల్ల తమ భవిష్యత్తు దెబ్బంతింటుందనే ఆందోళనలో దానిని వ్యతిరేకిస్తూ వీధుల్లోకి వస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో ఈ ఆందోళనలు హింసాత్మహకరంగా కూడా మారాయి. ఈ రోజు దీనికి సంబంధించి భారత్ బంద్ కు కూడా పిలుపునివ్వటం జరిగింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications