విమానాశ్రయ కౌంటర్లలో చెక్-ఇన్ చేయాలనుకుంటే 100 రూపాయల సర్వీస్ ఫీజు చెల్లించాలని విమానయాన సంస్థ ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ మహమ్మారి నేపధ్యంలో విమానాశ్రయంలో టచ్ పాయింట్లను తగ్గించడానికి ప్రయాణీకులకు వెబ్ చెక్-ఇన్ చెయ్యటాన్ని మే నెలలో విమానయాన మంత్రిత్వ శాఖ తప్పనిసరి చేసింది. ఇండిగో 2020 అక్టోబర్ 17 నుండి విమానాశ్రయ కౌంటర్లలో చెక్-ఇన్ కోసం 100 రూపాయల సేవా రుసుమును ప్రవేశపెట్టింది అని ఒక ప్రకటనలో తెలిపింది.
ఇండిగో వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ఉపయోగించి, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రయాణీకులందరినీ వెబ్ చెక్-ఇన్ చేయమని మేము ప్రోత్సహిస్తున్నామని పేర్కొంది . విమానాశ్రయ కౌంటర్లలో చెక్-ఇన్ ఫీజు అక్టోబర్ 17, 2020 నుండి చేసిన అన్ని బుకింగ్‌లకు వర్తిస్తుందని పేర్కొంది ఇండిగో ఎయిర్ లైన్స్ . తక్కువ-ధర క్యారియర్ అయిన ఇండిగో ఎయిర్ లైన్స్ తన వినియోగదారుల కోసం కాంటాక్ట్‌లెస్ మరియు ఇబ్బంది లేని ప్రయాణ అనుభవం కోసం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉందని చెప్పారు.

కరోనా నేపధ్యంలో సేఫ్టీ ప్రమాణాలను పాటించటానికి 100 రూపాయల సేవా చార్జ్ వేస్తున్నట్టు చెప్తున్నారు .ఆన్‌లైన్‌లో చెక్-ఇన్ చేయడం ద్వారా విమానాశ్రయంలో దీర్ఘ క్యూలలో వేచి ఉండకుండా ఉండటానికి వెబ్ చెక్-ఇన్ ఫీచర్ వినియోగదారులకు సహాయపడుతుంది. షెడ్యూల్ చేసిన ప్రయాణాలకు 1 గంట ముందు ఎప్పుడైనా వెబ్ చెక్-ఇన్ చేయవచ్చు. ఇండిగో మొబైల్ యాప్ తో ఇండిగో ఎయిర్లైన్స్ కు సంబంధించి అన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications