గత ఏడాది మందగమనం కారణంగా ఉద్యోగాల కోత వార్తలు విన్నాం. ఇప్పుడు కరోనా కారణంగా ఉద్యోగుల వేతనాల్లో కోతలు వినాల్సి వస్తోంది. తమ సీనియర్ ఉద్యోగులకు 5 శాతం నుండి 25 శాతం వరకు వేతనాల్లో కోత విధిస్తున్నట్లు ఇండిగో సీఈవో వెల్లడించారు. అందరికంటే అధికంగా తన వేతనంలో 25 శాతం కోత ఉంటుందని తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రయాణీకులు లేక విమానయానం ఇబ్బందుల్లో ఉందని, ఆదాయం క్షీణించిందన్నారు.

కరోనా ఎఫెక్ట్... మీ శాలరీలో కోత విధిస్తున్నాం.. ఇండిగో సీఈవో లేఖ
సంస్థ మనుగడ సాగించాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఈవో అన్నారు. నిర్వహణకు అవసరమైన నగదు ఉండేలా చూసుకోవాలని, అందుకే ఏ, బీ బ్యాండ్ ఉద్యోగులు మినహా మిగతా వారందరికీ 2020 ఏప్రిల్ 1వ తేదీ నుండి వేతనాల్లో కోత విధిస్తున్నట్లు ఉద్యోగులకు మెయిల్ పంపించారు. ఇందుకు గల కారణాలను అందులో పేర్కొన్నారు.

ఎవరికి ఎంత కోత అంటే
సీనియర్ వైస్ ప్రెసిడెండ్, ఆ పైస్థాయి అధికారుల వేతనాల్లో 20%, వైస్ ప్రెసిడెండ్, కాక్ పిట్ సిబ్బంది వేతనాల్లో 15%, బ్యాండ్ డీ సిబ్బందితో పాటు కేబిన్ సిబ్బంది వేతనాల్లో 10%, బ్యాండ్ సీ సిబ్బంది వేతనాల్లో 5% కోత విధిస్తున్నట్టు తెలిపారు.

ఇబ్బంది అని తెలుసు.. కానీ త్యాగాలు తప్పవు
వేతనాల్లో కోత విధిస్తే కుటుంబాలకు ఎంత ఇబ్బందికరమో తమకు తెలుసునని, కానీ ఈ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి సంస్థ మనుగడ సాగించాలంటే ఇది తప్పదని, త్యాగాలు చేయక తప్పని పరిస్థితి అని సీఈవో లేఖలో పేర్కొన్నారు. కరోనా ప్రభావం విమానయాన రంగంపై తీవ్రంగా ఉండటం భయాందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల ప్రభుత్వాలు ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేయడంతో మన అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేయాల్సి వచ్చింది. ప్రస్తుతం డొమెస్టిక్ బుకింగ్స్ కూడా 20% మేర తగ్గాయి. ముందు ముందు పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడే చెప్పలేమని సీఈవో పేర్కొన్నారు.

అదే బాటలో ఎయిరిండియా
అంతర్జాతీయ సర్వీసులను నిలిపివేసిన నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను తట్టుకునేందుకు ఎయిరిండియా కూడా సిబ్బంది వేతనంలో 5 శాతం కోత విధించాలని యోచిస్తోంది. కాంట్రాక్టుపై పునర్నియమించిన వంద మంది పైలట్లను తొలగించే ఆలోచన చేస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎయిరిండియా తమ కేబిన్ సిబ్బందికి ఫ్లయింగ్ అలవెన్సులను తగ్గించింది. పైలెట్లు, ఇతర సిబ్బందికి ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఉపసంహరించింది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమెరికా, కెనడా తదితర దేశాలకు ఎయిరిండియా అంతర్జాతీయ సర్వీసులన్నీ దాదాపు పూర్తిగా ఆగిపోవడంతో తమ ఉద్యోగుల వేతనాల్లో 5% కోత విధించాలని యోచిస్తోందట.

గోఎయిర్ వేతనరహిత సెలవులు
కరోనా ప్రభావాన్ని నిరోధించేందుకు గోఎయిర్ తమ నిర్వహణ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తమ ఉద్యోగులకు స్వల్పకాలంపాటు వేతనరహిత సెలవు ఇవ్వనున్నట్టు తెలిపింది. మార్చి 21 నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు అధిక అంతర్జాతీయ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు స్పైస్ జెట్ ప్రకటించింది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications