దేశవ్యాప్తంగా ఇండిగో విమాన రద్దులు, భారీ జాప్యాల కారణంగా ఏర్పడిన గందరగోళం నేపథ్యంలో సంస్థ అధికారికంగా క్షమాపణలు తెలిపింది. ప్రయాణీకులు ఎదుర్కొన్న అసౌకర్యం పట్ల విచారం వ్యక్తం చేస్తూ రద్దు చేసిన అన్ని టికెట్లకు పూర్తి రిఫండ్‌లు ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేయబడతాయని తెలిపింది. అలాగే డిసెంబర్ 5 నుండి 15 వరకు షెడ్యూల్ చేసిన ప్రయాణాల రద్దు, తిరిగి రీషెడ్యూల్ చేసుకునే ఫీజులు పూర్తిగా మాఫీ చేయబడతాయని సంస్థ ప్రకటించింది. పరిస్థితి స్థిరపడే వరకు ప్రయాణికులు విమానాశ్రయానికి రావడం నివారించాలని, ముందుగా ఆన్‌లైన్ ద్వారా వారి విమానం స్థితిని చెక్ చేయాలని ఇండిగో విజ్ఞప్తి చేసింది.
విమానాల రద్దుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణీకుల రవాణా ప్రత్యామ్నాయాల కోసం సెంట్రల్ రైల్వే కూడా ముందుకు వచ్చింది. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, పూణే-ఎస్‌బిసి, పూణే-న్యూఢిల్లీ, ఎల్‌టిటి-మడ్గావ్, సిఎస్‌ఎంటి-న్యూఢిల్లీ, ఎల్‌టిటి-లక్నో, నాగ్‌పూర్-సిఎస్‌ఎంటి మార్గాల్లో డిసెంబర్ 6, 7 తేదీల్లో ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైళ్లు అత్యవసర ప్రయాణ అవసరం ఉన్నవారికి గణనీయమైన ఉపశమనం కలిగిస్తాయని పేర్కొన్నారు.

ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి విమానయాన రంగం మొత్తం సైతం స్పందిస్తోంది. స్పైస్‌జెట్ చైర్మన్, ఎండీ అజయ్ సింగ్ రాబోయే రోజుల్లో 100 అదనపు విమానాలను నడపాలని నిర్ణయించామని తెలిపారు. ఇండిగో సమస్య కారణంగా వేలాది మంది ప్రయాణికులు కష్టాల్లో పడటం చాలా దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రయాణీకుల భద్రత, సౌకర్యం అత్యంత ప్రాధాన్యమని, విమానయాన సంస్థలు, ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయం అవసరమని ఆయన నొక్కిచెప్పారు.
బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా తీవ్రమైన ప్రభావాన్ని ఎదుర్కొంది. మొత్తం 125 రాకపోకలు, 167 నిష్క్రమణలు రద్దు చేయబడ్డాయని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ రద్దుల కారణంగా ప్రయాణ ప్రణాళికలు పూర్తిగా దెబ్బతిన్నాయని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ పరిస్థితి నేపధ్యంలో, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నలుగురు సభ్యుల ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సంఘటనల నేపథ్యాన్ని పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా సిఫార్సులు చేస్తుంది. DGCA జాయింట్ డైరెక్టర్ జనరల్ సంజయ్ కె. బ్రహ్మనే నేతృత్వంలో ఏర్పాటైన ఈ ప్యానెల్‌లో అమిత్ గుప్తా, కెప్టెన్ కపిల్ మాంగ్లిక్, కెప్టెన్ లోకేష్ రాంపాల్ ఉన్నారు.
ఇక ఎయిర్‌లైన్ పైలట్ల సంఘం (ALPA) ఇండిగోకు విమాన విధి సమయ నియమాలపై (FDTL) ఇచ్చిన ప్రత్యేక మినహాయింపులు "అసురక్షితమైనవి" అని పేర్కొంటూ DGCAను తీవ్రంగా విమర్శించింది. పైలట్‌లపై అధిక ఒత్తిడి పెడుతూ, ప్రయాణీకుల భద్రతను ప్రమాదంలోకి నెడుతుందని ఈ సంఘం ఆరోపించింది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, ఇండిగో చర్యలపై సమగ్ర దర్యాప్తు జరపాలని వారు డిమాండ్ చేశారు.
ఈ సంక్షోభంపై స్పందిస్తూ ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ విడుదల చేసిన వీడియో సందేశంలో..డిసెంబర్ 5 రోజునే వెయ్యికి పైగా విమానాలు రద్దు చేయబడ్డాయని, ఇది సంస్థ రోజువారీ ఆపరేషన్‌లో సగానికి పైగా ప్రభావం చూపిందని తెలిపారు. అసౌకర్యానికి విచారం వ్యక్తం చేస్తూ, కస్టమర్ కమ్యూనికేషన్‌ను బలోపేతం చేయడం, విమానాశ్రయాల్లో చిక్కుకున్న ప్రయాణికులకు సహాయం చేయడం, సిబ్బంది, విమానాలను పునర్వ్యవస్థీకరించడం వంటి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. డిసెంబర్ 10 నుండి 15 మధ్య పరిస్థితి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి: ఇండిగో విమానాలు రద్దుకు ప్రధాన కారణం పైలట్లు, విమాన సిబ్బంది కొరత. కొత్తగా అమలులోకి వచ్చిన DGCA (Directorate General of Civil Aviation) నియమాల ప్రకారం పైలట్లు, కేబిన్ సిబ్బంది పని గంటలు, విశ్రాంతి సమయాలపై కఠినమైన నియంత్రణలు పెట్టారు. రాత్రి వేళకు మించి పని చేయడం, వరుసగా ఎక్కువ గంటలు పనిచేయడం నిషేధించారు. కొత్త నియమాలకు అనుగుణంగా ఇండిగో షెడ్యూల్‌ను సర్దుబాటు చేయడంలో సమస్యలు వచ్చాయి. ఫలితంగా, పలువురు పైలట్లు అవసరమైన విశ్రాంతి సమయం తీసుకోవడంతో అందుబాటులో లేకపోయారు. అందువల్ల విమానాలకు సిబ్బంది అందక రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అదనంగా, కొన్ని రూట్లలో వాతావరణం, టెక్నికల్ సమస్యలు, ఎయిర్ ట్రాఫిక్ ఆలస్యం కూడా కారణమయ్యాయి. పరిస్థితి నియంత్రణ తప్పడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్‌పోర్ట్‌లలో ఎదురుచూడాల్సి వచ్చింది.ప్రస్తుతం ఇండిగో ప్రయాణికులకు పూర్తి రిఫండ్‌లు, ఫ్రీ రీషెడ్యూల్ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారానికి జోక్యం చేసుకుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications