ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (ఫిబ్రవరి) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సోమవారం నిర్మలమ్మ బడ్జెట్ నేపథ్యంలో వరుసగా మూడు రోజుల పాటు మార్కెట్లు లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. నిన్న సెన్సెక్స్ 50,255 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేడు మాత్రం ఓ సమయంలో 50,000 పాయింట్ల దిగువకు వచ్చింది. బడ్జెట్ ఇచ్చిన ఉత్సాహంతో మార్కెట్లు లాభాల్లో కొనసాగడంతో ఈ మూడు రోజుల లాభాలను ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ఉపయోగిస్తారు. ప్రధానంగా బ్యాంకింగ్ రంగంలో ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. దీంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి.

నష్టాల్లో మార్కెట్
ఉదయం గం.9.18 సమయానికి సెన్సెక్స్ 191.40 పాయింట్లు లేదా 0.38 శాతం లాభపడి 50064.35 వద్ద, నిఫ్టీ 48.50 పాయింట్లు లేదా 0.33 శాతం ఎగిసి 14741.50 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 50,212.25 వద్ద ప్రారంభమై, 50,250.17 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకి, 49,995.68 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఓ సమయంలో 270 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, ఉదయం గం.10.30 సమయానికి 170 పాయింట్లు నష్టపోయి 50,090 వద్ద ఉంది. నిఫ్టీ 35 పాయింట్లు నష్టపోయి 14,754 పాయింట్ల వద్ద ఉంది. క్రితం సెషన్లో 14,790 వద్ద ముగిసింది.
డాలర్ మారకంతో రూపాయి 72.94 వద్ద ప్రారంభమైంది. నిన్న 72.96 వద్ద ప్రారంభమైంది. అంటే దాదాపు ఫ్లాట్‌గా ఉంది. మంగళవారం 72.96 వద్దనే క్లోజ్ అయింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 5.63 శాతం, ONGC 4.34 శాతం, హిండాల్కో 3.58 శాతం, గెయిల్ 2.53 శాతం, మారుతీ సుజుకీ 1.94 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో ఇండస్ఇండ్ బ్యాంకు 2.28 శాతం, టైటాన్ కంపెనీ 1.98 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 1.84 శాతం, యాక్సిస్ బ్యాంకు 1.58 శాతం, HDFC బ్యాంకు 1.46 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 0.21 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.33 శాతం లాభపడింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 2.04 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.16 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.83 శాతం, నిఫ్టీ మీడియా 1.08 శాతం, నిఫ్టీ మెటల్ 1.29 శాతం, నిఫ్టీ ఫార్మా 1.23 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 0.79 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.74 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంకు 1.21 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.91 శాతం, నిఫ్టీ ఐటీ 0.28 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.39 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications