For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ లాభాల్లో మార్కెట్లు, ఐటీ, ఫార్మా రంగాలు జూమ్

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు(జూలై 30) లాభాల్లో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం గం.9.16 సెన్సెక్స్ 200 పాయింట్లు లాభపడి 38,271.85, నిఫ్టీ 49.80 పాయింట్లు లాభపడి 11,252.70 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రారంభంలో 664 షేర్లు లాభాల్లో, 265 షేర్లు నష్టాల్లో, 47 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఐటీ, ఫార్మా రంగాలు భారీ లాభాల్లో ఉన్నాయి.

టాప్ గెయినర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, మారుతీ సుజుకీ, విప్రో, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టాప్ లూజర్స్ జాబితాలో బీపీసీఎల్, ఐవోసీ, ఇండస్ఇండ్ బ్యాంకు, హీరో మోటో కార్ప్, పవర్ గ్రిడ్ కార్ప్ ఉన్నాయి. మధ్యాహ్నం గ.12.31 సమయానికి సెన్సెక్స్ 235 పాయింట్లు ఎగిసి 38,310 పాయింట్ల వద్ద ఉంది. ఈ రోజు మొత్తం వందలాది కంపెనీలు క్వార్టర్ ఫలితాలు ప్రకటించనున్నాయి.

Indices near days high: Sensex rises 300 points

డాక్టర్ రెడ్డీస్ ఈ రోజు నాలుగు శాతం జంప్ అయింది. ఈ కంపెనీ షేర్లు రెండు రోజుల్లో 10 శాతానికి పైగా జంప్ చేసింది. దీంతో సరికొత్త గరిష్టానికి చేరుకుంది. సాగర్ సిమెంట్స్ 12 శాతం దూసుకెళ్లింది. ఈ ఏడాది క్వార్టర్ 1 ఫలితాల్లో సాగర్ సిమెంట్స్ నికర లాభం 22 శాతం లాభపడి రూ.36 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం 23 శాతం క్షీణించి రూ.264 కోట్లకు చేరింది. వాటాదారులకు షేర్‌కు రూ.2.5 డివిడెండ్ ప్రకటించింది.

గుడ్‌న్యూస్: FY19 ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపుగుడ్‌న్యూస్: FY19 ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువు సెప్టెంబర్ 30 వరకు పొడిగింపు

డాక్టర్ రెడ్డీస్ తర్వాత విప్రో, మారుతీ సుజుకీ, ఏషియన్ పేయింట్స్, టీసీఎస్ మంచి లాభాల్లో ఉన్నాయి. టీసీఎస్ షేర్ ధర దాదాపు 2 శాతం పెరిగి రూ.2,319.50, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2.30 శాతం పెరిగి రూ.710.30 వద్ద, ఇన్ఫోసిస్ రూ.1.45 శాతం పెరిగి రూ.968.50కు చేరుకుంది. మారుతీ సుజుకీ షేర్ 2.67 శాతం పెరిగి రూ.6,350.00గా ఉంది.

English summary

భారీ లాభాల్లో మార్కెట్లు, ఐటీ, ఫార్మా రంగాలు జూమ్ | Indices near day's high: Sensex rises 300 points

Benchmark indices has extended the early gains supported by the IT and pharma stocks. Dr Reddys Labs, Wipro, TCS, Maruti Suzuki and Asian Paints are among major gainers on the Nifty.
Story first published: Thursday, July 30, 2020, 13:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X