For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏప్రిల్ నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ 55.5, స్తంభించిన తయారీ

|

భారత మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి ఏప్రిల్ నెలలో 8 నెలల కనిష్టానికి చేరుకుంది. IHS మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ ఇండెక్స్ (PMI) ఏప్రిల్ నెలలో 55.5గా ఉంది. మార్చిలో ఇది 55.4గా ఉంది. మార్చిలో ఎనిమిది నెలల కనిష్టానికి పడిపోయింది. ఏప్రిల్ నెలలోను దాదాపు అంతే ఉండటంతో అతి స్వల్పంగా మాత్రమే పెరిగింది. సూచీ 50 లోపుకు పడిపోతే క్షీణతగా భావిస్తారు. 50కి పైన ఉంటే వృద్ధి ధోరణిగా పేర్కొంటారు.

2014 జూలై తర్వాత ముడి పదార్థాల ధరలు చాలా వేగంగా పెరిగినట్లు తమ సర్వేలో వెల్లడైందని IHS మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పొలియన్నా డి లిమా తెలిపారు. ఏప్రిల్ నెలలో వరుసగా 8వ నెల ఎగుమతుల ఆర్డర్స్ పెరిగినట్లు చెప్పారు.

Indias manufacturing PMI improves slightly: reaches 55.5 in April

కొత్త ఎక్స్‌పోర్ట్ ఆర్డర్స్ ఏప్రిల్ నెలలోను పెరిగి వరుసగా ఎనిమిదో నెల సానుకూలంగా ఉన్నాయి. భారత ఉత్పత్తులకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడం ఇందుకు కలిసి వచ్చింది. కరోనా లాక్ డౌన్, ఆంక్షల నేపథ్యంలో ఏప్రిల్ నెలలో మర్చంటైజ్డ్ ఎగుమతులపై ప్రభావం పడింది. ఈ కాలంలో ఎగుమతులు 197 శాతం పెరిగి 30.21 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.ఇక తయారీ రంగంలో వరుసగా 13వ నెలా ఉపాధి అవకాశాలు తగ్గాయి. తయారీకి సంబంధించి పీఎంఐ సూచీ 50పైన కొనసాగడం ఇది వరుసగా తొమ్మిదో నెల.

English summary

ఏప్రిల్ నెలలో మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ 55.5, స్తంభించిన తయారీ | India's manufacturing PMI improves slightly: reaches 55.5 in April

India's manufacturing activity improved a tad in April despite fresh domestic factory orders and output easing to eight month lows due to an intensification of the coronavirus pandemic that was nullified by new export orders rising at fastest rate since October last year.
Story first published: Tuesday, May 4, 2021, 8:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X