FY22లో భారత జీడీపీ వృద్ధి రేటు 11 శాతంగా ఉండొచ్చు: క్రిసిల్ రేటింగ్ అంచనా
2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను భారత డొమెస్టిక్ జీడీపీ వృద్ధి రేటు (గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్) 11 శాతంగా ఉండవచ్చునని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికిగాను ఇది ప్రభుత్వం ఎకనమిక్ సర్వే 2020-21 సొంత అంచనాలకు అనుగుణంగా ఉంది. FY22లో జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మైనస్ నుండి ఏకంగా పదకొండు శాతానికి ఎగబాకవచ్చునని పేర్కొంది.

వృద్ధి వేగవంతం
FY21లో మైనస్ 8 శాతం ఉంటుందని అంచనా వేస్తోంది. సాధారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ భారీగా క్షీణిస్తుందని తొలుత అంచనా వేసినప్పటికీ వివిధ అంశాల కారణంగా క్షీణత తగ్గుతుందని అంచనా వేస్తోంది. ప్రజలు ప్రస్తుత కరోనా పరిస్థితికి అనుగుణంగా అలవాటు కావడం, కరోనా కేసులు భారీగా తగ్గిపోవడం, వ్యాక్సినేషన్ రోలవుట్, పెట్టుబడులు వంటి వివిధ కారణాలు వృద్ధి వేగవంతానికి కారణమని పేర్కొంది.

అప్పుడే కరోనా ముందుస్థాయికి
క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ డీకే జోషీ వెబినార్‌లో మాట్లాడుతూ కోవిడ్ 19 పాండమిక్ ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉందని, అయితే పై వివిధ అంశాల కారణంగా FY22లో వృద్ధి రేటు పుంజుకుంటుందని చెబుతున్నారు. తొలుత వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరం వేగవంతమైన వృద్ధిని కనబరచవచ్చునని జోషీ అన్నారు. వ్యాక్సినేషన్ వంటి వివిధ కారణాలతో రెండో అర్ధ సంవత్సరంలో మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. FY22 రెండో అర్ధ సంవత్సరంలో కరోనా ముందుస్థాయికి చేరుకోవచ్చునని పేర్కొన్నారు.

సగటు కంటే తక్కువ
2022 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి జీడీపీ వృద్ధి రేటు 2020 స్థాయి కంటే రెండు శాతం ఎక్కువగా ఉండవచ్చునని అంచనా వేశారు. FY23, FY25లలో జీడీపీ వృద్ధి రేటు సగటున 6.3 శాతం వరకు ఉండవచ్చునని, యావరేజ్ 6.7 శాతం కంటే ఇది తక్కువ అని జోషి తెలిపారు.


Click it and Unblock the Notifications