భారత్‌లో ఇటీవల కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. 52 లక్షల కేసులు దాటాయి. గతంలో రష్యాను, కొద్దిరోజుల క్రితం బ్రెజిల్‌ను దాటేసిన భారత్.. అక్టోబర్ నాటికి అమెరికాను(69 లక్షల కేసులు) దాటినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నది. 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్‌లో జీడీపీ ఏకంగా 23.9 శాతం మేర ప్రతికూలత నమోదు చేసింది.
పూర్తి ఆర్థిక సంవత్సరానికి మైనస్ 9 శాతం నుండి మైనస్ 14 శాతం మేర ఉండవచ్చునని వివిధ రేటింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా కోలుకుంటున్నప్పటికీ, కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్ లేకుంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని అంటున్నారు. ప్రస్తుతం భారత్ కొత్త గ్లోబల్ హాట్‌స్పాట్‌గా మారింది.

వ్యాపార కార్యకలాపాలు, వినియోగానికి దెబ్బ
ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు, గోల్డ్‌మన్ శాక్స్, క్రిసిల్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, పలువురు ఆర్థికవేత్తలు భారత వృద్ధి అంచనాలను ఇప్పటికే చారిత్రాత్మక కనిష్టానికి సవరించాయి. గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్ ఇంక్ జీడీపీ అంచనాలను మైనస్ 14.8 శాతం అంచనా వేసింది. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు మైనస్ 9గా అంచనా వేసింది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమి కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ మైనస్ 10.2 శాతంగా అంచనా వేసింది. కరోనా వైరస్ వ్యాప్తిని అదుపులోకి తీసుకు రావడంలో మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో వైఫల్యం చెందడం వ్యాపార కార్యకలాపాలను, వినియోగాన్ని దెబ్బతీస్తుందంటున్నారు. ఇది ఆర్థిక వృద్ధి క్షీణించడానికి కారణమవుతుందని చెబుతున్నారు.

కేసులు పెరిగితే ఆందోళనకరమే...
కరోనా కేసుల్లో అమెరికా తర్వాత రెండో స్థానంలో, మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత మూడో స్థానంలో ఉంది భారత్. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రెండో దశ వైరస్ వ్యాప్తీ ఆందోళనలోకి వెళ్లగా, భారత్‌లో మాత్రం మొదటి దశ కరోనానే ముగిసిపోలేదని ఫిచ్ రేటింగ్స్ లిమిటెడ్ యూనిట్ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ లిమిటెడ్ ప్రిన్సిపల్ ఎకనమిస్ట్ సునీల్ కుమార్ సిన్హా అన్నారు. ఈ పరిస్థితుల్లో భారత జీడీపీ మైనస్ 11.8 శాతం మేర క్షీణించవచ్చునని ఆయన అంచనా వేస్తున్నారు. అంతకుముందు మైనస్ 5.8 శాతంగా అంచనా వేశారు. 1996 తర్వాత భారత్ వృద్ధి దారుణంగా పతనం కానుందని గతవారం గోల్డ్‌మన్ శాక్స్ పేర్కొంది.

ఆర్థిక రికవరీపై అనిశ్చితి
ప్రపంచంలోనే సుదీర్ఘ లాక్ డౌన్ అనంతరం కార్యకలాపాలు క్రమంగా కోలుకుంటున్నాయి. అయినప్పటికీ బలమైన రికవరీ అనిశ్చితిగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. కేసులు పెరుగుతున్నందున ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకోవచ్చునని ఆర్బీఐ కూడా పేర్కొంది. ఆర్బీఐ అక్టోబర్ 1వ తేదీన వృద్ధి అంచనాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. జీడీపీ క్షీణించడం, బ్యాంకింగ్ రంగం ఒత్తిళ్లు భారత మీడియ్ టర్మ్ వృద్ధి పొటెన్షియల్‌పై ప్రభావం చూపనుందని అంటున్నారు. పొటెనన్షియల్ వృద్ధి అంచనా 6 శాతం మేర నెమ్మదించవచ్చునని అంటున్నారు. భారత్ కరోనా వైరస్ తీవ్రంగా ఉందని, ఇప్పటికే క్షీణించిన వృద్ధిపై మరింత ప్రభావం చూపుతుందని ప్రముఖ ఆర్థికవేత్త అభిషేక్ గుప్తా అన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 10.6 శాతం మేర ప్రతికూలత నమోదు చేస్తుందని, 2022 నాటికి వేగంగా పుంజుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
More From GoodReturns

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications