గాల్వాన్ ఘటన అనంతరం జూన్ 29వ తేదీన నరేంద్రమోడీ ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్స్‌ను నిషేధించిన విషయం తెలిసిందే. చైనా దుందుడుకు చర్యల వల్ల జరిగిన ఘర్షణలో 21 మంది భారత జవాన్లు అమరులవగా, చైనాకు కూడా 44 వరకు ప్రాణనష్టం జరిగినట్లుగా చెబుతున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, హెలో వంటి యాప్స్‌ను బ్యాన్ చేసింది. అయితే తాజాగా నీల్సన్ మీడియా సర్వేలో ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది.

గాల్వాన్‌కు ముందే తగ్గిన యాప్స్ యూసేజ్
జూన్ 15న గాల్వాన్ ఘటన జరిగిన విషయం తెలియగానే భారతీయులు ఎక్కువమంది చైనీస్ యాప్స్‌ను ఉపయోగించడం తగ్గించారని నీల్సన్ మీడియా సర్వేలో వెల్లడైంది. జూన్ 20వ తేదీ నాటికి ఈ యాప్స్‌ను ఉపయోగించే వారి సంఖ్య 5 శాతం తగ్గి 77 శాతానికి చేరుకుందని, ఆ తర్వాత 76 శాతానికి చేరుకుందని వెల్లడించింది. టైర్ 1 నగరాల్లో అలాగే 15-24 ఏళ్ల యువత యాప్స్ వాడకాన్ని ఎక్కువగా తగ్గించింది. ఈ రెండు సెగ్మెంట్లలో ఏకంగా 11 శాతం తగ్గినట్లు ఈ సర్వే వెల్లడించింది.

సగటు సెషన్ల సంఖ్య
ఈ యాప్స్‌ను ఉపయోగించే సగటు సెషన్ల సంఖ్య జూన్ 27వ తేదీకి 10 శాతం తగ్గింది. జూన్ 20తో ముగిసిన వారానికి ఇది 7.4 శాతం ఉండగా, జూన్ 27తో ముగిసిన వారానికి 5.4 శాతానికి పడిపోయింది. 15-24 ఏళ్ల వయసులోని పురుషులు ఈ యాప్స్ చూడటం బాగా తగ్గించారు. ఈ సెగ్మెంట్‌లో 18 శాతం తగ్గింది. టైర్ 2 నగరాల్లో అయితే ఏకంగా 20 శాతం తగ్గింది.

ప్రభుత్వ ప్రకటనకు ముందే
కరోనా మహమ్మారి నేపథ్యంలో జూన్ 13వ తేదీతో ముగిసిన వారానికి ఈ యాప్స్ యూసేజ్ 80 శాతానికి చేరుకుంది. సగటు సెషన్ల సంఖ్య రోజుకు 8గా ఉంది. అంటే ప్రభుత్వం ప్రకటించడానికి ముందే ప్రజలు చైనా యాప్స్‌ను బహిష్కరించడం పెద్ద ఎత్తున ప్రారంభించారు. చైనా యాప్స్‌ను వాడవద్దని అప్పటికే సోషల్ మీడియా సహా వివిధ మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీంతో ఈ యాప్స్ పైన ప్రభావం పడింది. నీల్సన్ 15-44 ఏళ్ల మధ్య వయస్సు గల 1 లక్ష మొబైల్ ఫోన్స్ డేటా ఆధారంగా ఈ నివేదిక తయారు చేసింది.

స్పోర్ట్స్, వినోదం తగ్గింది
ఇదిలా ఉండగా బ్రాడ్‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (BARC) టీవీ వ్యూయర్ షిప్ జూలై 3తో ముగిసిన వారానికి 1.017 ట్రిలియన్ మినట్స్‌గా ఉంది. ప్రీ-కోవిడ్ సమయంలో ఇది 887 బిలియన్ మినట్స్‌గా ఉంది. అయితే లాక్ డౌన్ సమయం కంటే మాత్రం తక్కువ. లాక్ డౌన్ సమయంలో 1.266 ట్రిలియన్ మినట్స్‌గా ఉంది. కరోనా, గాల్వాన్ సహా వివిధ కారణాలతో ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపడంతో వీక్షకుల సంఖ్య పెరిగింది. కొత్త కంటెంట్ లేకపోవడంతో వినోదం, స్పోర్ట్స్‌కు డిమాండ్ తగ్గింది. అంతేకాదు, ప్రకటనలు కూడా మందగించాయి. కరోనా సమయంలో రీ-టెలికాస్ట్ అయిన పౌరాణిక సీరియల్స్ ఎక్కువగా చూశారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications