సరిహద్దుల్లో నాటకాలు ఆడుతున్న చైనా కు చెక్ పెట్టేందుకు అత్యవసరంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య దేశీయ మొబైల్ ఆప్ కంపెనీలకు వరంలా మారింది. గాల్వాన్ లోయ వద్ద జరిగిన కొట్లాట లో 20 మంది భారత జవాన్ల ప్రాణాలు తీసిన డ్రాగన్ కు బుద్ధి చెప్పేందుకు ఇటీవలే కేంద్రం టిక్ టాక్ సహా 59 మొబైల్ ఆప్స్ ను నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో చైనా ఏమో కానీ భారత్ లో మాత్రం ఒక్కసారిగా కోట్ల మంది టిక్ టాక్ యూజర్లు పెద్ద షాక్ కు గురయ్యారు.
ఐతే అంతలోనే టిక్ టాక్ తరహా మొబైల్ ఆప్ లకు గూగుల్ ప్లే స్టోర్ లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీంతో షేర్ చాట్ కూడా సరిగ్గా అలాంటి ఫీచర్లు ఉన్న సరికొత్త మొబైల్ ఆప్ ను అందుబాటులోకి తెచ్చింది. మోజ్ అనే పేరుతో ప్రస్తుతం షేర్ చాట్ కు సంబంధించిన మొబైల్ ఆప్ వినియోగదారులు డౌన్ లోడ్ చేసుకునేందుకు రెడీ గా ఉంది. ప్లే స్టోర్ లో ఉంచి నాలుగైదు రోజులే అవుతున్నా... ఇప్పటికే ఇది 10,000 డౌన్ లోడ్ల మెయిలు రాయిని అధిగమించింది. అందులో మోజ్ కు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

తెలుగు సహా అనేక ప్రాంతీయ భాషల్లో ...
షేర్ చాట్ రూపొందించిన మోజ్ ఆప్... సరిగ్గా టిక్ టాక్ ను పోలి ఉంది. ఇందులో కూడా 15 సెకండ్ల నిడివి గల వీడియోల ను అప్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. అదే సమయంలో లిప్ సింకింగ్ ఆప్షన్ అనుసంధానించారు. ఈ మొబైల్ ఆప్ ను జూన్ 29న గూగుల్ ప్లే స్టోర్ లో పెట్టగా సుమారు 10,000 మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. భారతీయ భాషలకు పెద్ద పీట వేస్తున్న మోజ్ మొబైల్ ఆప్ తెలుగు సహా 15 ఇతర ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంది. తమిళ్, భోజపురి, ఒరియా, హర్యాన్వీ వంటి భాషల్లో కూడా ఇది అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్ ఆప్ ను కాస్త హడావిడిగా తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో అన్ని ఫీచర్లు సరిగ్గా పనిచేయటం లేదు. డౌన్ లోడ్ చేసుకున్న వారందరూ తమ వీడియో లు అప్లోడ్ చేసుకునే అవకాశం లేదు. కానీ వాటిని డౌన్ లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. త్వరలోనే ఈ ఫీచర్లను మెరుగు పరుస్తారని నిపుణులు భావిస్తున్నారు.

మేడ్ ఇన్ ఇండియా ఆప్ లకు గిరాకీ...
చైనా ఆప్ లపై నిషేధం విధించటంతో ఒక్కసారిగా స్వదేశే మొబైల్ ఆప్స్ కు డిమాండ్ పెరిగిపోయింది. మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఆప్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు కూడా ముందుకు వస్తున్నారు. ఇటీవల సరిగ్గా టిక్ టాక్ లాంటి ఫీచర్లున్న మిత్రోన్ మొబైల్ యాప్ ఒక సంచలనమే అయ్యింది. కానీ అంతలోనే దానిని ప్లే స్టోర్ నుంచి తొలగించారు. కానీ, ఇప్పుడు మళ్ళీ దానికి గిరాకీ ఏర్పడింది. తాజాగా ఆ సంస్థలో లెట్స్ వెంచర్, 3 వన్ 4 కాపిటల్ వంటి సంస్థలు రూ 2 కోట్ల పెట్టుబడులు పెట్టాయి. దీంతో త్వరలోనే మరింత మెరుగ్గా మిత్రోన్ తన సేవలు అందించే అవకాశం ఉంది. ఇది కాకుండా జీ గ్రూప్ నకు చెందిన జీ5 అనే మొబైల్ ఆప్ కూడా టిక్ టాక్ తరహాలోనే అందుబాటులోకి రానుంది. దీనిపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ముందు వరుసలో రోపోసో...
టిక్ టాక్ పై నిషేధం విధించగానే వెంటనే వినియోగదారులు రోపోసో అనే మొబైల్ ఆప్ ను డౌన్ లోడ్ చేసుకోవటం మొదలు పెట్టారు. దీంతో ప్రస్తుతం ప్లే స్టోర్ లో అత్యధిక డౌన్ లోడ్స్ సాధించి అగ్రస్థానంలో నిలిచింది. చింగారి లాంటి మొబైల్ ఆప్స్ కూడా దూసుకుపోతున్నాయి. అయితే, నిషేధానికి గురి కాక ముందు చైనా కు చెందిన టిక్ టాక్ కు భారత్ లో 20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వారంతా ప్రస్తుతం దేశీయ మొబైల్ ఆప్స్ లో ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నారు. త్వరలోనే ఇప్పటికే ఉన్న ఆప్ లు మరింత మెరుగ్గా తమ సేవలు అందిస్తాయని, అదే సమయంలో కొత్త సంస్థలు కూడా తమ ప్రొడక్టులను ప్రవేశపెడతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఒక్క టిక్ టాక్ స్థానంలో కనీసం 10 దేశీయ మొబైల్ యాప్ జనాదరణ సాధించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications