TCS: టాటాలు ఎల్లప్పుడూ ప్రత్యేకమే అని చెప్పటానికి ఇదొక మంచి ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. అవును అమెరికాలోని అనేక టెక్ దిగ్గజాలు మాంద్యం భయాల మధ్య పరిస్థితులను చక్కదిద్దేందుకు ఉద్యోగుల తొలగింపులను ఎంచుకున్నాయి. కానీ.. టీసీఎస్ మాత్రం విస్తరణపై ధీమాగా ఉంది. అమెరికాలో ప్రస్తుతం ఉన్న ఆందోళనకర సమయంలో ఇది సాహసోపేతమైన ప్రకటన అని చెప్పుకోవాలి.

టీసీఎస్ ప్లాన్..
ఇండియన్ ఐటీ దిగ్గజం టీసీఎస్ చేసిన ప్రకటన చాలా మంది టెక్కీల్లో పరిస్థితులు చక్కబడతాయని ఆత్మవిశ్వాసాన్ని నింపుతోంది. ప్రస్తుతం కంపెనీకి యూఎస్ లోని ఇల్లినాయిస్ లో 3000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. గడచిన ఐదేళ్ల కాలంలో కంపెనీ 1,100 మందిని నియమించుకుంది. టెక్ లేఆఫ్ లు భారీగా పెరిగిన నేపథ్యంలో.. 2024 చివరి నాటికి 1,200 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ప్రణాళికను ప్రకటించింది.

విద్యార్థులకు..
కొత్త నియామకాలు సైతం ఇల్లినాయిస్ రాష్ట్రంలో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. దానితో పాటు 25 శాతం మంది విద్యార్థులు, ఉపాధ్యాయులను కవర్ చేయడానికి స్థానిక పాఠశాలల్లో STEM ఔట్రీచ్ ప్రయత్నాలను టీసీఎస్ వేగవంతం చేస్తోంది. కంపెనీ ప్రణాళికలపై ఇల్లినాయిస్ గవర్నర్ JB ప్రిట్జ్‌కర్ హర్షం వ్యక్తం చేశారు.

టెక్నాలజీస్..
ఉత్తర అమెరికాలో పనిచేస్తున్న TCS ప్రధానంగా క్లౌడ్ కంప్యూటింగ్, AI, సైబర్ సెక్యూరిటీతో పాటు ఇతర సాంకేతికతల్లో ప్రతిభావంతులను ఆకర్షిస్తోంది. వారు భవిష్యత్తులో సిద్ధంగా ఉన్న ఎంటర్‌ప్రైజెస్‌గా మారడానికి సహాయపడతారని TCS ఛైర్మన్ సురేష్ ముత్తుస్వామి చెప్పారు.

50 ఏళ్ల అనుభందం..
భారతీయ టెక్ కంపెనీ టీసీఎస్ అమెరికాలో గత 50 ఏళ్లకు ముందు నుంటే ఉంది. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో దాదాపు సగం కంపెనీలు తమ వ్యాపారాలను డిజిటల్‌గా మార్చుకోవడానికి, వృద్ధి చేసుకోవడానికి TCSతో భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. కంపెనీ గత ఐదేళ్లలో ఇల్లినాయిస్ కాలేజీల్లోని 512 మంది గ్రాడ్యుయేట్లను నియమించుకుంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications