2019-20లో అమెరికా ఎకానమీకి భారతీయ విద్యార్థుల కాంట్రిబ్యూట్ చేసింది ఎంతో తెలుసా? అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే గత ఏడాది భారతీయ విద్యార్థుల సంఖ్య 4.4 శాతం తగ్గినప్పటికీ 2019-20 విద్యా సంవత్సరంలో మన విద్యార్థులు అగ్రరాజ్యం ఆర్థిక వ్యవస్థకు 7.6 బిలియన్ డాలర్లు అందించారు. చైనా, భారత్ సహా ఎన్నో దేశాల విద్యార్థులు అమెరికాలో చదువు పట్ల ఆసక్తి చూపిస్తారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు అమెరికాకు చదువుల కోసం వెళ్తారు. వీరు అమెరికా జీడీపీ వృద్ధికి దోహదపడుతున్నారు.

చైనా ఫస్ట్... ఇండియా సెకండ్
అమెరికాకు చదువుల కోసం వెళ్లే విద్యార్థుల్లో చైనా, భారత్, జపాన్, దక్షిణాఫ్రికా తదితర దేశాల నుండి ఉన్నారు. భారత్ నుండి గత ఏడాది 1,93,124 మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. అయితే భారత్ కంటే చైనా నుండి అధిక రాబడి వచ్చింది. ఈ మేరకు ఓపెన్స్ డోర్ 2020 నివేదిక వెల్లడించింది. అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో చైనీలు మొదటి స్థానంలో ఉన్నారు. వరుసగా 16వ సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరిగింది. 2019-20 సంవత్సరంలో 3,72,000 మంది చైనీస్ విద్యార్థులు చదువుల కోసం అమెరికా వెళ్లారు. అంటే భారత విద్యార్థులతో పోలిస్తే దాదాపు రెండింతలు.

మొత్తం 44 బిలియన్ డాలర్లు
యునైటెడ్ స్టేట్స్ డిపార్టుమెంట్ ఆఫ్ స్టేట్స్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషల్ ఎడ్యుకేషన్ నివేదిక ప్రకారం వరుసగా 5వ సంవత్సరం అమెరికాకు చదువుల కోసం వచ్చిన విద్యార్థుల సంఖ్య 10 లక్షలు దాటింది. గత ఏడాది 10,75,496గా ఉంది.
2019-20 సంవత్సరంలో అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థులు 1.8 శాతం తగ్గినప్పటికీ యునైటెడ్ స్టేట్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టంలో మొత్తం విద్యార్థుల్లో వీరి వాటా 5.5 శాతంగా ఉంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్టుమెంట్ ఆఫ్ కామర్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ప్రకారం అమెరికాకు ఇంటర్నేషనల్ విద్యార్థుల కాంట్రిబ్యూషన్ 44 బిలియన్ డాలర్లు. ఇందులో భారత విద్యార్థుల వాటా 7.6 బిలియన్ డాలర్లు.

ఈ దేశాల నుండి పెరిగి, ఈ దేశాల నుండి తగ్గింది..
వరుసగా ఐదో సంవత్సరం 10 లక్షలకు పైగా విద్యార్థులను అమెరికాకు ఆహ్వానించడం ఆనందంగా ఉందని అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ అఫైర్స్ మేరీ రాయ్స్ అన్నారు. అంతర్జాతీయ విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం అమెరికా గమ్యస్థానమన్నారు. చైనా, భారత్‌తో పాటు టాప్ 20లోని వివిధ దేశాల నుండి 2019-20లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. బంగ్లాదేశ్ నుండి 7శాతం, బ్రెజిల్ నుండి 4 శాతం, నైజీరియా నుండి 3 శాతం పెరిగింది. అదే సమయంలో సౌదీ అరేబియా నుండి 17 శాతం తగ్గడం గమనార్హం. సౌదీ ప్రభుత్వం స్కాలర్‌షిప్ ప్రోగ్రాం మార్పుల నేపథ్యంలో అమెరికాకు వెళ్లడం తగ్గింది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications