Stock Market: స్వల్ప లాభాల్లో ట్రేడవుతోన్న స్టాక్ మార్కెట్లు..
సోమవారం స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతోన్నాయి. ఉదయం 9:53 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 75 పాయింట్లి పెరిగి 62,701 వద్ద కొనసాగుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 24 పాయింట్ల లాభంతో 18,587 వద్ద ట్రేడవుతుంది. US ఫెడ్ పాలసీ ఫలితాలు, IIP డేటా, CPI ద్రవ్యోల్బణం. WPI ద్రవ్యోల్బణం డేటా ఈ వారంలో విడుదల కానున్నాయి.
బీఎస్ఈ 30 ఇండెక్స్ లో ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, టీసీఎస్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, ఎస్బీఐఎన్, హిందూస్థాన్ యూనిలివర్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్ సర్వ్ లాభాల్లో ట్రేడవుతున్నాయి.

కొటాక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, సన్ ఫార్మా, హెడ్ ఎఫ్సీ బ్యాంకు, హెడ్ ఎఫ్సీ, ఏసియన్ పెయింట్స్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, మారుతి, అల్ట్రా టెక్ సిమెంట్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్అండ్ టీ, టైటాన్ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. బ్యాంక్ నిఫ్టీ స్వల్ప నష్టాల్లో ట్రేడవుతోంది.
బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.13 శాతం వృద్ధితో కొనసాగుతోంది. బీఎస్ఈ స్మాల్ క్యాప్ 0.53 శాతం వృద్ధితో ట్రేడవుతోంది. ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ TVS మోటార్‌కు అనుబంధంగా ఉన్న TVS మోటార్ (సింగపూర్)స్విస్ E-మొబిలిటీ గ్రూప్ (హోల్డింగ్) AGలో అదనంగా 25 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అంగీకరించినట్లు తెలిపింది. దీంతో టీవీఎస్ స్టాక్ పెరింగింది.


Click it and Unblock the Notifications