స్టాక్ మార్కెట్ గురువారం నష్టాల్లో ప్రారంభమైంది. యూఎస్ ఫెడ్ నిర్ణయంతో సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ 75 బెసిస్ పాయింట్లను పెంచింది. గతంలో కూడా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచింది. ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం ఇది నాలుగోసారి. ఇది భారత మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇండెక్స్ ప్రారంభ ట్రేడ్‌లో 278 పాయింట్లు క్షీణించి 60,628 వద్దకు చేరుకుంది.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఇండెక్స్ 0.4 శాతం పడిపోయినప్పటికీ 18,020 స్థాయి కొనసాగుతోంది. అటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ (MPC) గురువారం సమావేశమవుతుంది. వరుసగా మూడు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. గురువారం ప్రారంభంలో S&P 500, నాస్‌డాక్ ఫ్యూచర్లు మరింత క్షీణించాయి. దీనితో ఆసియా మార్కెట్లు దిగువకు చేరుకున్నాయి.

బీఎస్ఈ-30 లో టైటాన్, యాక్సిస్, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ, ఎస్బీఐఎన్, ఎల్&టీ, ఇండస్ లాండ్, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంకు, డా. రెడ్డీస్ లాభాల్లో ఉండగా.. సన్ ఫార్మా, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకు, హెచ్ సీఎల్ టెక్, ఎన్టీపీసీ, ఎమ్ &ఎమ్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.


Click it and Unblock the Notifications