Stock Market : లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు...
బుధవారం స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల 15 నిమిషాలకు బీఎస్ఈ సెన్సెక్స్ 201 పాయింట్ల పెరిగి 73,069 వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 55 పాయింట్ల పెరిగి 22,202 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ 30 ఇండెక్స్ లో జేఎస్ డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, భారతి ఎయిర్ టెల్, ఎస్బీఐఎన్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎన్టీపీ, ఐటీసీ, టైటాన్, రిలయన్స్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, విప్రో, హెచ్ సీఎల్ టెక్ లాభాల్లో ట్రేడవుతోన్నాయి.
ఏసియన్ పెయింట్స్, హిందుస్థాన్ యూనిలివర్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, టీసీఎస్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఎల్ అండ్ టీ నష్టాల్లో కొనసాగతోన్నాయ. నిఫ్టీలో హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌లు లాభాల్లో ఉన్నాయి. హీరో మోటోకార్ప్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, అపోలో హాస్పిటల్స్ నష్టాల్లో కొనసాగుతోన్నాయి.

పీఎస్‌యూ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం రూ. 3,000 కోట్ల క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (క్యూఐపీ)ని ఒక్కో షేరు ధర రూ.142.78గా ప్రకటించింది. దేవయాని ఇంటర్నేషనల్ లో రూ. 871 కోట్ల విలువైన 5.3 కోట్ల షేర్లు ఎన్ బ్లాక్ డీల్ విండోలో ఒక్కో షేరుకు రూ. 164.10 చొప్పున మారాయనిని CNBC-TV18 పేర్కొంది.


Click it and Unblock the Notifications